Title (Indic)ఈతని కెదురు లేరు యెక్కడ చూచిన నిదె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఈతని కెదురు లేరు యెక్కడ చూచిన నిదె చేతనే ప్రతాపముతో చెలరేఁగీ నితఁడు (॥ఈతని॥) దిక్కులు సాధించుటకు దేవదేవోత్తముఁ డదె యెక్కెను తేరుమీఁద యెచ్చరికతో చక్కాడి దనుజులను సమరములు గెలిచి యిక్కువతో వీధి వీధి నేఁగీ నిదిగో (॥ఈతని॥) సకలాయుధములునుఁ జక్రము చేతులఁ బట్టి వెకలియై శంఖము వేవేగ నాడించె వికలులై రాక్షిసులు వీఁగి లోఁగి హతులైరి అకలంకుఁ డీ హరి అన్నిటాను మించెను (॥ఈతని॥) విజయధ్వజము నదె వీఁడె శ్రీవేంకటేశుఁడు భజన నలమేలుమంగ పలుమారు మెచ్చె నదె త్రిజగములు నితఁడె దిక్కై కాచీ నిదె గజబిజ లింక నుడుగరో రాక్షసులు English(||pallavi||) īdani kĕduru leru yĕkkaḍa sūsina nidĕ sedane pradābamudo sĕlarem̐gī nidam̐ḍu (||īdani||) dikkulu sādhiṁchuḍagu devadevottamum̐ ḍadĕ yĕkkĕnu terumīm̐da yĕchcharigado sakkāḍi danujulanu samaramulu gĕlisi yikkuvado vīdhi vīdhi nem̐gī nidigo (||īdani||) sagalāyudhamulunum̐ jakramu sedulam̐ baṭṭi vĕgaliyai śhaṁkhamu vevega nāḍiṁchĕ vigalulai rākṣhisulu vīm̐gi lom̐gi hadulairi agalaṁkum̐ ḍī hari anniḍānu miṁchĕnu (||īdani||) vijayadhvajamu nadĕ vīm̐ḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu bhajana nalamelumaṁga palumāru mĕchchĕ nadĕ trijagamulu nidam̐ḍĕ dikkai kāsī nidĕ gajabija liṁka nuḍugaro rākṣhasulu