Title (Indic)ఎటువంటి వేడుకలో యెదలోనే గుబ్బతిలీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎటువంటి వేడుకలో యెదలోనే గుబ్బతిలీ కుటిలకుంతలి నేర్పు కొనసాగీనయ్యా (॥ఎటు॥) చెలగి తప్పకచూచు సిగ్గుతోఁ దలవంచు తలఁపులో నీరూపు దలపోసును సెలవులనే నవ్వు చెలికిఁ బ్రియముచెప్పు కలికిభావము చెప్పఁ గతలాయనయ్యా (॥ఎటు॥) కోరును మనోరథాలు గుట్టుతోడనే కరఁగు సారె నేకాంతాన నుండు సంతోసించును చేరి మాటాడ నూహించు చెమరించు మేనెల్లా నీరజాక్షిచందములు నీవే యెంచుకోవయ్యా (॥ఎటు॥) పవళించు పానుపుపై భావరతి నోలలాడు కవగూడి నీవు రాఁగాఁ గడుమెచ్చును ఇవల శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ జవరాలి కూటములు సంగతేయనయ్యా English(||pallavi||) ĕḍuvaṁṭi veḍugalo yĕdalone gubbadilī kuḍilaguṁtali nerbu kŏnasāgīnayyā (||ĕḍu||) sĕlagi tappagasūsu siggudom̐ dalavaṁchu talam̐pulo nīrūbu dalabosunu sĕlavulane navvu sĕligim̐ briyamusĕppu kaligibhāvamu sĕppam̐ gadalāyanayyā (||ĕḍu||) korunu manorathālu guṭṭudoḍane karam̐gu sārĕ negāṁtāna nuṁḍu saṁtosiṁchunu seri māḍāḍa nūhiṁchu sĕmariṁchu menĕllā nīrajākṣhisaṁdamulu nīve yĕṁchugovayyā (||ĕḍu||) pavaḽiṁchu pānububai bhāvaradi nolalāḍu kavagūḍi nīvu rām̐gām̐ gaḍumĕchchunu ivala śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga javarāli kūḍamulu saṁgadeyanayyā