Title (Indic)ఎటువంటి పొందులో మీ యిద్దరికిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎటువంటి పొందులో మీ యిద్దరికిని తటునక మాకు నేఁడు తారుకాణ లాయను (॥ఎటు॥) ముసి ముసి నవ్వులతో ముచ్చట చెప్పీ నాకె విసుగక చెవులారా వినవయ్యా కొసరుచుఁ జెలి నిన్నుఁ గొంగువట్టి పెనఁగీని సుసరాన లోనైతే సూటికి రావయ్యా (॥ఎటు॥) సిగ్గులు వడక నిన్నుఁ జెక్కు నొక్కి వేఁడు కొనీ దిగ్గన నందుకు సమ్మతించవయ్యా వెగ్గళపుఁదమి తోడ వీడెము నీకిచ్చీని వొగ్గి యందుకొని సేవవొప్ప గొనవయ్యా (॥ఎటు॥) వెక్కసముగా నీకు వినయాన మొక్కీని చొక్కుచు మోము దప్పక చూడవయ్యా యిక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు తక్కక యాకె చెనకీ తప్పించుకొవయ్యా English(||pallavi||) ĕḍuvaṁṭi pŏṁdulo mī yiddarigini taḍunaga māgu nem̐ḍu tārugāṇa lāyanu (||ĕḍu||) musi musi navvulado muchchaḍa sĕppī nāgĕ visugaga sĕvulārā vinavayyā kŏsarusum̐ jĕli ninnum̐ gŏṁguvaṭṭi pĕnam̐gīni susarāna lonaide sūḍigi rāvayyā (||ĕḍu||) siggulu vaḍaga ninnum̐ jĕkku nŏkki vem̐ḍu kŏnī diggana naṁdugu sammadiṁchavayyā vĕggaḽabum̐dami toḍa vīḍĕmu nīgichchīni vŏggi yaṁdugŏni sevavŏppa gŏnavayyā (||ĕḍu||) vĕkkasamugā nīgu vinayāna mŏkkīni sŏkkusu momu dappaga sūḍavayyā yikkaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu takkaga yāgĕ sĕnagī tappiṁchugŏvayyā