Title (Indic)ఎదుటనే వుండఁగాను యెడమాఁట లేమిటికే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎదుటనే వుండఁగాను యెడమాఁట లేమిటికే కదిసి పెనఁగులాడే కలయికలే మేలే (॥ఎదు॥) మచ్చికలు నెరపితే మనసు లేకము లౌను ఇచ్చకము తెచ్చితేనే యింపులు వుట్టు ముచ్చటలు గలసితే ముదురు నడియాసలు మెచ్చులుగా బతితోడి మేలములే మేలే (॥ఎదు॥) నగవు లుప్పతిలితే ననుపులు సమకూడు మొగమాట గలిగితే మొనయు దమి తగులాయా లొనరితే దట్టమౌను వలపులు మగవానితో మంచిమాటలే మేలే (॥ఎదు॥) చూపులు తారసించే సొంపులు మిక్కుటమౌను కాఁపురాలు దొరకితే గట్టియౌఁ బొందు పైపై నీమీఁది బత్తిఁ బాయక నన్నేలినాఁడు చేపట్టి శ్రీవేంకటేశు సేవలే మేలే English(||pallavi||) ĕduḍane vuṁḍam̐gānu yĕḍamām̐ṭa lemiḍige kadisi pĕnam̐gulāḍe kalayigale mele (||ĕdu||) machchigalu nĕrabide manasu legamu launu ichchagamu tĕchchidene yiṁpulu vuṭṭu muchchaḍalu galaside muduru naḍiyāsalu mĕchchulugā badidoḍi melamule mele (||ĕdu||) nagavu luppadilide nanubulu samagūḍu mŏgamāḍa galigide mŏnayu dami tagulāyā lŏnaride daṭṭamaunu valabulu magavānido maṁchimāḍale mele (||ĕdu||) sūbulu tārasiṁche sŏṁpulu mikkuḍamaunu kām̐purālu dŏragide gaṭṭiyaum̐ bŏṁdu paibai nīmīm̐di battim̐ bāyaga nannelinām̐ḍu sebaṭṭi śhrīveṁkaḍeśhu sevale mele