Title (Indic)ఎదిరి నెఱఁగవు నీ యితవే చూచేవుగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎదిరి నెఱఁగవు నీ యితవే చూచేవుగాని యెదఁ బెట్టున్నారము యేము(మ?) నేము నేము (॥ఎది॥) గడుసునిన్నుఁ జూచితే కాఁకరేఁగీ నాకైతే నడుమ నీవూరకే నవ్వేవు గాని వుడికినందుమీఁదట వుప్పలు చల్లినట్టాయ యెడనెడ నీచేఁతల కేమనేము నేము (॥ఎది॥) కుచ్చితపునిన్నుఁ జేరుకొనఁ గొలుపదు నాకు అచ్చువలె నీవు మాటలాడేవుగాని ముచ్చటదీర నీవేళ మోము గప్పినట్లాయ హెచ్చిననీసుద్దులకు నేమనేము నేము (॥ఎది॥) దిమ్మరిని న్నంటుకొన సమ్మతించదు నాకైతే లెమ్మని నీవే కాఁగిలించేవుగాని చిమ్ముచు శ్రీవేంకటేశ చేఁదే తీపైనట్లాయ యెమ్మెలనీమన్ననకు యేమనేము నేము English(||pallavi||) ĕdiri nĕṟam̐gavu nī yidave sūsevugāni yĕdam̐ bĕṭṭunnāramu yemu(ma?) nemu nemu (||ĕdi||) gaḍusuninnum̐ jūside kām̐karem̐gī nāgaide naḍuma nīvūrage navvevu gāni vuḍiginaṁdumīm̐daḍa vuppalu sallinaṭṭāya yĕḍanĕḍa nīsem̐tala kemanemu nemu (||ĕdi||) kuchchidabuninnum̐ jerugŏnam̐ gŏlubadu nāgu achchuvalĕ nīvu māḍalāḍevugāni muchchaḍadīra nīveḽa momu gappinaṭlāya hĕchchinanīsuddulagu nemanemu nemu (||ĕdi||) dimmarini nnaṁṭugŏna sammadiṁchadu nāgaide lĕmmani nīve kām̐giliṁchevugāni simmusu śhrīveṁkaḍeśha sem̐de tībainaṭlāya yĕmmĕlanīmannanagu yemanemu nemu