Title (Indic)ఏదాయ నేమి హరి యిచ్చిన జన్మమే చాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏదాయ నేమి హరి యిచ్చిన జన్మమే చాలు ఆదినారాయణుఁ డీయఖిలరక్షకుఁడు (॥ఏదా॥) శునకముబతుకును సుఖమయ్యే తోఁచుఁగాని తన కది హీనమని తలఁచుకోదు మనసొడఁబడితేను మంచిదేమి కానిదేమి తనువులో నంతరాత్మ దైవమౌట దప్పదు (॥ఏదా॥) పురువుకుండేనెలవు భవనేశ్వరమై తోఁచు పెరచోటి గుంతయైన ప్రియమైయుండు యిరవై వుండితేఁజాలు యెగువేమి దిగువేమి వరుస లోకములు “సర్వం విష్ణుమయ”ము (॥ఏదా॥) అచ్చమైన జ్ఞానికి నంతా వైకుంఠమే చెచ్చెరఁ దనతిమ్మటే జీవన్ముక్తి కచ్చుపట్టి శ్రీ వేంకటపతిదాసుఁడైతే హెచ్చుకుందేమిలేదు యేలినవాఁడితఁడే English(||pallavi||) edāya nemi hari yichchina janmame sālu ādinārāyaṇum̐ ḍīyakhilarakṣhagum̐ḍu (||edā||) śhunagamubadugunu sukhamayye tom̐sum̐gāni tana kadi hīnamani talam̐sugodu manasŏḍam̐baḍidenu maṁchidemi kānidemi tanuvulo naṁtarātma daivamauḍa dappadu (||edā||) puruvuguṁḍenĕlavu bhavaneśhvaramai tom̐su pĕrasoḍi guṁtayaina priyamaiyuṁḍu yiravai vuṁḍidem̐jālu yĕguvemi diguvemi varusa logamulu “sarvaṁ viṣhṇumaya”mu (||edā||) achchamaina jñānigi naṁtā vaiguṁṭhame sĕchchĕram̐ danadimmaḍe jīvanmukti kachchubaṭṭi śhrī veṁkaḍabadidāsum̐ḍaide hĕchchuguṁdemiledu yelinavām̐ḍidam̐ḍe