Title (Indic)ఏడ వలపేడ మచ్చి కేడ సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏడ వలపేడ మచ్చి కేడ సుద్దులు ఆడుకొన్న మాటలెల్ల నవి నిజాలా (॥ఏడ॥) తొలుకారు మెఱుపులు తోచి పోవుఁగాక నెలకొని మింట నవి నిలిచీనా పొలఁతుల వలపులు పొలసిపోవుఁగాక కలకాలం బవి కడతేరీనా (॥ఏడ॥) యెండమావులు చూడ నేరులై పారుఁగాక అండకుఁబోవ దాహ మణఁగీనా నిండినట్టి మోహము నెలఁతల మదిఁ జూడ వుండినట్టేవుండుఁగాక వూఁతయ్యీనా (॥ఏడ॥) కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాక మెలఁకువఁ జూడ నవి మెరసీనా అలివేణులమేలు ఆసపాటేకాక తలఁపు వేంకటపతిఁ దగిలీనా English(||pallavi||) eḍa valabeḍa machchi keḍa suddulu āḍugŏnna māḍalĕlla navi nijālā (||eḍa||) tŏlugāru mĕṟubulu tosi povum̐gāga nĕlagŏni miṁṭa navi nilisīnā pŏlam̐tula valabulu pŏlasibovum̐gāga kalagālaṁ bavi kaḍaderīnā (||eḍa||) yĕṁḍamāvulu sūḍa nerulai pārum̐gāga aṁḍagum̐bova dāha maṇam̐gīnā niṁḍinaṭṭi mohamu nĕlam̐tala madim̐ jūḍa vuṁḍinaṭṭevuṁḍum̐gāga vūm̐tayyīnā (||eḍa||) kalalonisirulĕlla kanugūrgulegāga mĕlam̐kuvam̐ jūḍa navi mĕrasīnā aliveṇulamelu āsabāḍegāga talam̐pu veṁkaḍabadim̐ dagilīnā