Title (Indic)ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు బూడిదిలో హోమమై పోయఁ గాలము (॥ఏడ॥) ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడి నని కదిసిన యాసచేఁ గడవలేక యెదురుచూచి చూచి యెలయించి యెలయించి పొదచాటు మృగమై పోయఁ గాలము (॥ఏడ॥) ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని వింతవింత వగలచే వేఁగివేఁగి చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని- పొంతనున్న వెన్నయై పోయఁ గాలము (॥ఏడ॥) యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని యెక్కడికైనా నూర కేఁగియేఁగి గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక పుక్కిటి పురాణమయి పోయఁ గాలము English(||pallavi||) eḍa sujñāna meḍa tĕlivi nāgu būḍidilo homamai poyam̐ gālamu (||eḍa||) idĕ melayyĕḍi nā kadĕ melayyĕḍi nani kadisina yāsasem̐ gaḍavalega yĕdurusūsi sūsi yĕlayiṁchi yĕlayiṁchi pŏdasāḍu mṛgamai poyam̐ gālamu (||eḍa||) iṁtaḍam̐ dīrĕḍi duḥkha maṁtaḍam̐ dīrĕḍinani viṁtaviṁta vagalase vem̐givem̐gi siṁtayu vedanalam̐ jikkuvaḍusu nagni- pŏṁtanunna vĕnnayai poyam̐ gālamu (||eḍa||) yikkaḍa sukhamu nā kakkaḍa sukhaṁbani yĕkkaḍigainā nūra kem̐giyem̐gi gakkana śhrīdiruveṁkaḍabadim̐ gānaga pukkiḍi purāṇamayi poyam̐ gālamu