Title (Indic)ఏడ సుద్దు లేడ మాటలెందాఁకాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏడ సుద్దు లేడ మాటలెందాఁకాను వేడుక పడేవు నీకు వేగిరమేలయ్యా (॥ఏడ॥) చెప్పరాని మాటలెల్లాఁ జెప్పుమంటాఁ జెవులొగ్గే- వప్పటినానలు వెట్టే వందుమీఁద యిప్పుడు చెలులు నేము నేకతమాడితిమని విప్పుచూ నెవ్వరు నీకు విన్నవించిరయ్యా (॥ఏడ॥) మాలోని ముచ్చటలెల్లా మగుడఁ జెప్పుమనేవు చేలకొంగు వట్టేవు చెక్కునొక్కేవు ఆలోచించి గుజగుజలాడుకొంటిమనుచును పోలించేవు నీవేడ పొంచువింటివయ్యా (॥ఏడ॥) మరిగి మేమాడుకొన్న మదనరహస్యములు వొరసి చెప్పుమనేవు వొడివట్టేవు గరిమ శ్రీవేంకటేశ కలిసితివిటు నన్ను యిరవుగా నీవెట్టు యెఱిఁగితివయ్యా English(||pallavi||) eḍa suddu leḍa māḍalĕṁdām̐kānu veḍuga paḍevu nīgu vegiramelayyā (||eḍa||) sĕpparāni māḍalĕllām̐ jĕppumaṁṭām̐ jĕvulŏgge- vappaḍinānalu vĕṭṭe vaṁdumīm̐da yippuḍu sĕlulu nemu negadamāḍidimani vippusū nĕvvaru nīgu vinnaviṁchirayyā (||eḍa||) māloni muchchaḍalĕllā maguḍam̐ jĕppumanevu selagŏṁgu vaṭṭevu sĕkkunŏkkevu ālosiṁchi gujagujalāḍugŏṁṭimanusunu poliṁchevu nīveḍa pŏṁchuviṁṭivayyā (||eḍa||) marigi memāḍugŏnna madanarahasyamulu vŏrasi sĕppumanevu vŏḍivaṭṭevu garima śhrīveṁkaḍeśha kalisidiviḍu nannu yiravugā nīvĕṭṭu yĕṟim̐gidivayyā