Title (Indic)ఏడ సుద్ది నన్నుఁ జూచి యేల కొంకేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏడ సుద్ది నన్నుఁ జూచి యేల కొంకేవు ఆడా నీడా నిన్నొరయ నంకకత్తెనా (॥ఏడ॥) యిచ్చక మాడేదాన యెగ్గులు వట్టేనా విచ్చన విడుల మీకు వెఱపేఁటికి చెచ్చెర నింకా నీవు సేసినట్టె సేతుగాక పచ్చి తిట్టు దిట్ట నీతో పంతగత్తెనా (॥ఏడ॥) లోనైవుండినదాన లోఁగి రట్టు సేసేనా పేనిపట్టి మాఁట మఱపించనేఁటికి నేనీడనుండఁగానే నీవే మన్నింతువుగాక ఆనవెట్టి పెనఁగ నే నాసకత్తెనా (॥ఏడ॥) గక్కనఁ గూడినదాన కడమ వెట్టేనా చెక్కు చేతితోడనీకుఁ జింత యేఁటికి యిక్కడ శ్రీ వేంకటేశ యిరవై వుందువుగాక పెక్కు బుద్దిచెప్ప నీకుఁ బెల్లి కత్తెనా English(||pallavi||) eḍa suddi nannum̐ jūsi yela kŏṁkevu āḍā nīḍā ninnŏraya naṁkagattĕnā (||eḍa||) yichchaga māḍedāna yĕggulu vaṭṭenā vichchana viḍula mīgu vĕṟabem̐ṭigi sĕchchĕra niṁkā nīvu sesinaṭṭĕ sedugāga pachchi tiṭṭu diṭṭa nīdo paṁtagattĕnā (||eḍa||) lonaivuṁḍinadāna lom̐gi raṭṭu sesenā penibaṭṭi mām̐ṭa maṟabiṁchanem̐ṭigi nenīḍanuṁḍam̐gāne nīve manniṁtuvugāga ānavĕṭṭi pĕnam̐ga ne nāsagattĕnā (||eḍa||) gakkanam̐ gūḍinadāna kaḍama vĕṭṭenā sĕkku sedidoḍanīgum̐ jiṁta yem̐ṭigi yikkaḍa śhrī veṁkaḍeśha yiravai vuṁduvugāga pĕkku buddisĕppa nīgum̐ bĕlli kattĕnā