Title (Indic)ఏడ నుండి వచ్చినాఁడే ఇపుడు దాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏడ నుండి వచ్చినాఁడే ఇపుడు దాను వోడక జాణతనాల కొడిగట్టీఁ గాక (॥ఏడ॥) చూడఁజూడఁ జూపులకు సుంకములేలడిగీనే వేడుకకు వెలగద్దా వేసాలుగాక వాడికనవ్వులకు వావులేల చెప్పీనే తోడఁదొడ వలపులు దొంతివెట్టీఁగాక (॥ఏడ॥) మేలపుమాటలకు మీరి కొంగేల పట్టినే యీలకూర కుప్పుగద్దా యెమ్మెలుగాక పోలిక చక్కఁదనాలు పురుఁడేల పెట్టీనే తాలిమితో రతులకు దమి రేఁచీఁగాక (॥ఏడ॥) నేరుపుల చేఁతలకు నెపమేల వెదకీనే కోరికకు మితిగద్దా కొత్తలుగాక యీరీతి శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను చేరినన్నుఁగూడి యిట్టె చెలరేఁగీఁగాక English(||pallavi||) eḍa nuṁḍi vachchinām̐ḍe ibuḍu dānu voḍaga jāṇadanāla kŏḍigaṭṭīm̐ gāga (||eḍa||) sūḍam̐jūḍam̐ jūbulagu suṁkamulelaḍigīne veḍugagu vĕlagaddā vesālugāga vāḍiganavvulagu vāvulela sĕppīne toḍam̐dŏḍa valabulu dŏṁtivĕṭṭīm̐gāga (||eḍa||) melabumāḍalagu mīri kŏṁgela paṭṭine yīlagūra kuppugaddā yĕmmĕlugāga poliga sakkam̐danālu purum̐ḍela pĕṭṭīne tālimido radulagu dami rem̐sīm̐gāga (||eḍa||) nerubula sem̐talagu nĕbamela vĕdagīne korigagu midigaddā kŏttalugāga yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu serinannum̐gūḍi yiṭṭĕ sĕlarem̐gīm̐gāga