Title (Indic)ఏడ నేరుచుకొంటిరే యివెల్లా మీరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏడ నేరుచుకొంటిరే యివెల్లా మీరు వాడికలు నెరపేరు వంతులకు మీరు (॥ఏడ॥) మచ్చిక నాతఁడు నేనూ మాటలాడఁగానే మీరు యిచ్చటఁ బతికి మాట లేమి చెప్పిరే కచ్చుపెట్టి నావంటి కాంతలఁ దెచ్చె రటరే ఇచ్చకములు సేసేరు ఇటు నటు మీరు (॥ఏడ॥) తతి నిద్దరము నేకతాన నుండఁగానే మీరు యితనికి సన్నలు మీరేమి సేసేరే యితవుగా నావలెనే ఇంపులు చూపేరటరే కతకారితనములు గరుపేరు మీరు (॥ఏడ॥) శ్రీవేంకటేశుఁడు నేనుఁ జేరి కూడఁగానే మీరు యీవల నేమి కానుక లిపు డిచ్చేరే చేవదేరఁ జేసేసేవ సేయించే రటరే వావు లెవ్వరివో చెప్పివచ్చేరు మీరు English(||pallavi||) eḍa nerusugŏṁṭire yivĕllā mīru vāḍigalu nĕraberu vaṁtulagu mīru (||eḍa||) machchiga nādam̐ḍu nenū māḍalāḍam̐gāne mīru yichchaḍam̐ badigi māḍa lemi sĕppire kachchubĕṭṭi nāvaṁṭi kāṁtalam̐ dĕchchĕ raḍare ichchagamulu seseru iḍu naḍu mīru (||eḍa||) tadi niddaramu negadāna nuṁḍam̐gāne mīru yidanigi sannalu mīremi sesere yidavugā nāvalĕne iṁpulu sūberaḍare kadagāridanamulu garuberu mīru (||eḍa||) śhrīveṁkaḍeśhum̐ḍu nenum̐ jeri kūḍam̐gāne mīru yīvala nemi kānuga libu ḍichchere sevaderam̐ jeseseva seyiṁche raḍare vāvu lĕvvarivo sĕppivachcheru mīru