Title (Indic)ఎడ మాటాడించ నేల యెమ్మెలఁ బెనఁగనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎడ మాటాడించ నేల యెమ్మెలఁ బెనఁగనేల వొడఁబడవలెఁగాక వొక్కటైనవారికి (॥ఎడ॥) వలపులు మొదలనే వా(వ్రా)సివున్నవి నుదుళ్ల చలపాదితనమేల సరసులకు మొలచినతరితీపు మోవితేనెల నున్నది యెలయింపు లిఁకనేల యెనసినవారికి (॥ఎడ॥) తనివోనికోరికలు దాఁచివున్నవి మతుల కినియనేఁటికి నెఱిఁగినవారికి నినుపులై పాయములు నిండివున్నవి మేనుల అనుమానించఁగనేల ఆపగలవారికి (॥ఎడ॥) పరగినరతులెల్లా పాఁతివున్నవి కాఁగిళ్ల నెరసులు మరియేల నేర్పరులకు గరిమ శ్రీవేంకటేశ కలసితి రిద్దరును పొరపొచ్చా లిఁకనేల పొఁ(ప్రొం)దైనవారిక English(||pallavi||) ĕḍa māḍāḍiṁcha nela yĕmmĕlam̐ bĕnam̐ganela vŏḍam̐baḍavalĕm̐gāga vŏkkaḍainavārigi (||ĕḍa||) valabulu mŏdalane vā(vrā)sivunnavi nuduḽla salabādidanamela sarasulagu mŏlasinadaridību movidenĕla nunnadi yĕlayiṁpu lim̐kanela yĕnasinavārigi (||ĕḍa||) tanivonigorigalu dām̐sivunnavi madula kiniyanem̐ṭigi nĕṟim̐ginavārigi ninubulai pāyamulu niṁḍivunnavi menula anumāniṁcham̐ganela ābagalavārigi (||ĕḍa||) paraginaradulĕllā pām̐tivunnavi kām̐giḽla nĕrasulu mariyela nerbarulagu garima śhrīveṁkaḍeśha kalasidi riddarunu pŏrabŏchchā lim̐kanela pŏm̐(prŏṁ)dainavāriga