Title (Indic)ఏడ కేడ యెంచి చూచి యెఱఁగవటే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏడ కేడ యెంచి చూచి యెఱఁగవటే కూడునా కపటములు (ల?) కూటము లెందైనను (॥ఏడ॥) మోమువంపుఁ గోప మేడ ముసిముసి నవ్వు లేడ యేమే యెండలు వెన్నెల లెనయునటే దోమటి వొట్లివి యాడ తొంగిచూపు లివి యాడ సామై నల్లవేఁడియునుఁ జలువయుఁ గూడునా (॥ఏడ॥) అంటితేఁ బెనఁగు లేడ అందులోఁ గొంకు లేడ జంటఁ గారములు దీపఁ జవు లౌనటే బంటు బంటు పంత మేడ బాస లెచ్చరించ నేల వొంటిఁ జీఁకటి వెలుఁగు వుండునా యెందైనను (॥ఏడ॥) అవ్వలయి వుండ నేల అద్దములో సన్నలేల దవ్వులుఁ జేరువ లొక తారుకాణటే రవ్వల శ్రీవెంకటాద్రిరమణుఁడనె నిన్ను యివ్వలఁ గూడితి నింక నెర వౌనటే English(||pallavi||) eḍa keḍa yĕṁchi sūsi yĕṟam̐gavaḍe kūḍunā kabaḍamulu (la?) kūḍamu lĕṁdainanu (||eḍa||) momuvaṁpum̐ goba meḍa musimusi navvu leḍa yeme yĕṁḍalu vĕnnĕla lĕnayunaḍe domaḍi vŏṭlivi yāḍa tŏṁgisūbu livi yāḍa sāmai nallavem̐ḍiyunum̐ jaluvayum̐ gūḍunā (||eḍa||) aṁṭidem̐ bĕnam̐gu leḍa aṁdulom̐ gŏṁku leḍa jaṁṭam̐ gāramulu dībam̐ javu launaḍe baṁṭu baṁṭu paṁta meḍa bāsa lĕchchariṁcha nela vŏṁṭim̐ jīm̐kaḍi vĕlum̐gu vuṁḍunā yĕṁdainanu (||eḍa||) avvalayi vuṁḍa nela addamulo sannalela davvulum̐ jeruva lŏga tārugāṇaḍe ravvala śhrīvĕṁkaḍādriramaṇum̐ḍanĕ ninnu yivvalam̐ gūḍidi niṁka nĕra vaunaḍe