Title (Indic)ఏడ ధర్మ మేడ కర్మ మిన్నియు నీ సేవేకాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏడ ధర్మ మేడ కర్మ మిన్నియు నీ సేవేకాక యీడనే యిందుకు సాక్షి ఇట్టే నిలిపితివి (॥ఏడ॥) తెగువసేసి నీకుఁ దెచ్చిరి బోనములు మగండ్లమాటదోసి మౌనిసతులు తగ నిన్నుఁ జేపట్టుటే ధర్మముగా నిలిపి జగ మెరఁగఁగ వేదసమ్మతి సేసితివి (॥ఏడ॥) బల్లిదాన నిన్నుఁ బొందే బలుసాహసము సేసి తల్లిదండ్రిమాట దోసి తానే రుక్మిణి యెల్లగా నీకు మోహించు టెక్కుడుతగవు సేసి వెల్లవిరి నాపె నీవు వీధుల నేఁగితివి (॥ఏడ॥) శ్రీవేంకటేశ నిన్ను సేవించవచ్చితేఁ జాలు భావించి రక్షింతువు నీపరుషలను యీవల నీకు మొక్కుటే యిన్ని పుణ్యములూ జేసి(?) కావించి హీనుల మమ్ము ఘనులఁ జేసితివి English(||pallavi||) eḍa dharma meḍa karma minniyu nī sevegāga yīḍane yiṁdugu sākṣhi iṭṭe nilibidivi (||eḍa||) tĕguvasesi nīgum̐ dĕchchiri bonamulu magaṁḍlamāḍadosi maunisadulu taga ninnum̐ jebaṭṭuḍe dharmamugā nilibi jaga mĕram̐gam̐ga vedasammadi sesidivi (||eḍa||) ballidāna ninnum̐ bŏṁde balusāhasamu sesi tallidaṁḍrimāḍa dosi tāne rukmiṇi yĕllagā nīgu mohiṁchu ṭĕkkuḍudagavu sesi vĕllaviri nābĕ nīvu vīdhula nem̐gidivi (||eḍa||) śhrīveṁkaḍeśha ninnu seviṁchavachchidem̐ jālu bhāviṁchi rakṣhiṁtuvu nībaruṣhalanu yīvala nīgu mŏkkuḍe yinni puṇyamulū jesi(?) kāviṁchi hīnula mammu ghanulam̐ jesidivi