Title (Indic)ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని - మచ్చిక పెనుఁదెవులు మానకపోయె (॥ఎచ్చో॥) పాయపు సతులగుబ్బల పెదపొట్లాల కాయము వడి నొత్తి కాఁచఁగను రాయిడిచే ఘనమాయఁగాని లోని- మాయపు పెనుఁదెవులు మానకపోయె (॥ఎచ్చో॥) అతివల మోహపుటధరామృతములు యితవుగ నోరి కందియ్యఁగను అదిమోహమే ఘనమాయఁగాని లోని- మతకరిపెనుఁదెవులు మానకపొయె (॥ఎచ్చో॥) తరుణుల మేనిమెత్తనిపరపులమీఁద- నిరవుగ నిటు సుఖియించఁగను తిరువేంకటాచలాధీశుకృపచేఁగాని మరుచేతి పెనుఁదెవులు మానకపోయె English(||pallavi||) ĕchchoḍi kem̐gina yĕppuḍūm̐ damaloni - machchiga pĕnum̐dĕvulu mānagaboyĕ (||ĕchcho||) pāyabu sadulagubbala pĕdabŏṭlāla kāyamu vaḍi nŏtti kām̐sam̐ganu rāyiḍise ghanamāyam̐gāni loni- māyabu pĕnum̐dĕvulu mānagaboyĕ (||ĕchcho||) adivala mohabuḍadharāmṛtamulu yidavuga nori kaṁdiyyam̐ganu adimohame ghanamāyam̐gāni loni- madagaribĕnum̐dĕvulu mānagabŏyĕ (||ĕchcho||) taruṇula menimĕttanibarabulamīm̐da- niravuga niḍu sukhiyiṁcham̐ganu tiruveṁkaḍāsalādhīśhukṛpasem̐gāni marusedi pĕnum̐dĕvulu mānagaboyĕ