Title (Indic)ఎచ్చరించవయ్యా నీవు యింతి తన్నుఁ దా మఱచె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎచ్చరించవయ్యా నీవు యింతి తన్నుఁ దా మఱచె మచ్చికనాయకుఁడ నీ మందెమేళములను (॥ఎచ్చ॥) పలుకఁగ మఱచెను పడఁతి నిన్నుఁజూచి పలుకరాకున్నమతి భ్రమయించఁగా సెలవి నవ్వ మఱచె చెలువుఁడ నీపేరు తలఁచి తలఁచి చొక్కె తమకంబునను (॥ఎచ్చ॥) అడుగు వెట్ట మఱచె నంగన నీ కెదురేఁగి కడు నీకు సన్నచేసె కాతరానను అడరి విన మఱచె నప్పుడే నీమాఁటలు పడఁతి పానుపు చేరె పరవశమునను (॥ఎచ్చ॥) యిప్పుడే మెచ్చమఱచె యింతిని నీవు గూడఁగ కప్పిననీరతులలో గర్వానను చెప్పరాదు యిఁక నేమి శ్రీవేంకటేశ్వరుఁడ తప్పులెల్లా మఱచె నీతములము వంకను English(||pallavi||) ĕchchariṁchavayyā nīvu yiṁti tannum̐ dā maṟasĕ machchiganāyagum̐ḍa nī maṁdĕmeḽamulanu (||ĕchcha||) palugam̐ga maṟasĕnu paḍam̐ti ninnum̐jūsi palugarāgunnamadi bhramayiṁcham̐gā sĕlavi navva maṟasĕ sĕluvum̐ḍa nīberu talam̐si talam̐si sŏkkĕ tamagaṁbunanu (||ĕchcha||) aḍugu vĕṭṭa maṟasĕ naṁgana nī kĕdurem̐gi kaḍu nīgu sannasesĕ kādarānanu aḍari vina maṟasĕ nappuḍe nīmām̐ṭalu paḍam̐ti pānubu serĕ paravaśhamunanu (||ĕchcha||) yippuḍe mĕchchamaṟasĕ yiṁtini nīvu gūḍam̐ga kappinanīradulalo garvānanu sĕpparādu yim̐ka nemi śhrīveṁkaḍeśhvarum̐ḍa tappulĕllā maṟasĕ nīdamulamu vaṁkanu