Title (Indic)ఎచ్చటఁ జూచిన నితఁడై కృష్ణుడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎచ్చటఁ జూచిన నితఁడై కృష్ణుడు మచ్చిక నలమేలుమంగతో వెలసీ (॥ఎచ్చ॥) కొట్టరో వుట్టులు గోపాలబాలులు యిట్టె కృష్ణుని యెదుటను పట్టరో వారలు పాలు నేతికిని గట్టిగ జోరునఁ గారీ నవిగో (॥ఎచ్చ॥) కూడరో మూఁకలు కోలలవారలు వేడుకఁ గృష్ణుని వెంటవెంట ఆడుచు మెసఁగరొ అడుఁకులుఁ జక్కిలాలు వాడల వాడల వరుసతోను (॥ఎచ్చ॥) నిక్కి తీసుకోరో నెఱవాదికాండ్లు మక్కువఁ గృష్ణుని మఱఁగునను యెక్కరో శ్రీవేంకటేశు కొండమీఁద పెక్కు నురుగులు పెరుగులు నివిగో English(||pallavi||) ĕchchaḍam̐ jūsina nidam̐ḍai kṛṣhṇuḍu machchiga nalamelumaṁgado vĕlasī (||ĕchcha||) kŏṭṭaro vuṭṭulu gobālabālulu yiṭṭĕ kṛṣhṇuni yĕduḍanu paṭṭaro vāralu pālu nedigini gaṭṭiga jorunam̐ gārī navigo (||ĕchcha||) kūḍaro mūm̐kalu kolalavāralu veḍugam̐ gṛṣhṇuni vĕṁṭavĕṁṭa āḍusu mĕsam̐garŏ aḍum̐kulum̐ jakkilālu vāḍala vāḍala varusadonu (||ĕchcha||) nikki tīsugoro nĕṟavādigāṁḍlu makkuvam̐ gṛṣhṇuni maṟam̐gunanu yĕkkaro śhrīveṁkaḍeśhu kŏṁḍamīm̐da pĕkku nurugulu pĕrugulu nivigo