Title (Indic)ఎపుడు వత్తువోయనుచు యెదురు చూచీఁ జెలియ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎపుడు వత్తువోయనుచు యెదురు చూచీఁ జెలియ వుపమించి చెప్పితిమి వువిదఁ జెందవయ్యా (॥ఎపు॥) నలఁతకనుగనువలకు వీమోముఁ జందురుని - నలరంగఁ జూపగదవయ్య నేఁడు కలికి చక్కఁదనంబు కడఁగి ప్రతిబింబించ తళుకు నీచెక్కుటద్దములు చూపవయ్యా (॥ఎపు॥) నిరతి మెఇఁదీగెకును నీటాహుశాఖ లివి అరడుగాఁ జూపఁగదవయ్య నేఁడు సరిఁ జన్నుజక్కవలు జంటవాయకయుండ తొరల తనుసూర్యకాంతులు చూపవయ్యా (॥ఎపు॥) గళనాద పకములకు కడునీజవ్వనమదము అలమి చోటుగఁ జూపవయ్య నేఁడు వలచి శ్రీవేంకటేశ్వర యాకెఁ గూడితిని కలకాలమును నిటులఁ గరుణ చూపవయ్యా English(||pallavi||) ĕbuḍu vattuvoyanusu yĕduru sūsīm̐ jĕliya vubamiṁchi sĕppidimi vuvidam̐ jĕṁdavayyā (||ĕbu||) nalam̐taganuganuvalagu vīmomum̐ jaṁduruni - nalaraṁgam̐ jūbagadavayya nem̐ḍu kaligi sakkam̐danaṁbu kaḍam̐gi pradibiṁbiṁcha taḽugu nīsĕkkuḍaddamulu sūbavayyā (||ĕbu||) niradi mĕim̐dīgĕgunu nīḍāhuśhākha livi araḍugām̐ jūbam̐gadavayya nem̐ḍu sarim̐ jannujakkavalu jaṁṭavāyagayuṁḍa tŏrala tanusūryagāṁtulu sūbavayyā (||ĕbu||) gaḽanāda pagamulagu kaḍunījavvanamadamu alami soḍugam̐ jūbavayya nem̐ḍu valasi śhrīveṁkaḍeśhvara yāgĕm̐ gūḍidini kalagālamunu niḍulam̐ garuṇa sūbavayyā