Title (Indic)ఎపుడు నాయెడ నీకు నిదివలెనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎపుడు నాయెడ నీకు నిదివలెనా కపటాలు నిజములు కలిగినాతఁడవు (॥ఎపుడు॥) వెల్లిగా నీవూర్పు వేదమట వేఁడి చల్లీని శ్రుతికి నుష్ణము గలదా పెల్లుగ నిరువంకఁ బిరువీకులై వేఁడి చల్ద నీదైనా వెచ్చనిది గావలదా (॥ఎపుడు॥) నగు నీమాటలే పురాణంబులట బొంకు దగిలీని చదువులింతయు బొంకులా తెగి యిరువంకలఁ దీదీపులై నీ పొగరుల మాటలెప్పుడును నిక్కము లా (॥ఎపుడు॥) చలివేఁడిచూపుల జాణవట యిట్టె బలసి నాపైఁ బరపఁగవలెనా కలికివై తిరువేంకటవిభుఁడ నన్నుఁ గలయక యలయించి కలిసితివిపుడు English(||pallavi||) ĕbuḍu nāyĕḍa nīgu nidivalĕnā kabaḍālu nijamulu kaliginādam̐ḍavu (||ĕbuḍu||) vĕlligā nīvūrbu vedamaḍa vem̐ḍi sallīni śhrudigi nuṣhṇamu galadā pĕlluga niruvaṁkam̐ biruvīgulai vem̐ḍi salda nīdainā vĕchchanidi gāvaladā (||ĕbuḍu||) nagu nīmāḍale purāṇaṁbulaḍa bŏṁku dagilīni saduvuliṁtayu bŏṁkulā tĕgi yiruvaṁkalam̐ dīdībulai nī pŏgarula māḍalĕppuḍunu nikkamu lā (||ĕbuḍu||) salivem̐ḍisūbula jāṇavaḍa yiṭṭĕ balasi nābaim̐ barabam̐gavalĕnā kaligivai tiruveṁkaḍavibhum̐ḍa nannum̐ galayaga yalayiṁchi kalisidivibuḍu