Title (Indic)ఏ వుపాయములు యెక్కడి కెక్కను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ వుపాయములు యెక్కడి కెక్కను శ్రీవల్లభ నీ సేవే ఘనము (॥ఏవు॥) చదివిన బుద్ధులు శాస్త్రపు యుక్తులే వెదకును జ్ఞానము వెదకను తుదఁబుణ్యవిధులు దొడ్డపుణ్యములే యెదుగాఁ జేయించు యెనయదు విరతి (॥ఏవు॥) చెవిలోన కతలు చెప్పినంతవడె తవిలి జ్ఞానము దాఁటదు భువి శివములు వుబ్బులంబరవశములె భవహరమగు నీ భక్తికిఁ జొరదు (॥ఏవు॥) నరసురులసేవ నామధారికమే దురిత హరంబై తూరదు యిరవగు శ్రీ వేంకటేశ్వర నీవే కరుణించి మముఁ గాతువు గాక English(||pallavi||) e vubāyamulu yĕkkaḍi kĕkkanu śhrīvallabha nī seve ghanamu (||evu||) sadivina buddhulu śhāstrabu yuktule vĕdagunu jñānamu vĕdaganu tudam̐buṇyavidhulu dŏḍḍabuṇyamule yĕdugām̐ jeyiṁchu yĕnayadu viradi (||evu||) sĕvilona kadalu sĕppinaṁtavaḍĕ tavili jñānamu dām̐ṭadu bhuvi śhivamulu vubbulaṁbaravaśhamulĕ bhavaharamagu nī bhaktigim̐ jŏradu (||evu||) narasurulaseva nāmadhārigame durida haraṁbai tūradu yiravagu śhrī veṁkaḍeśhvara nīve karuṇiṁchi mamum̐ gāduvu gāga