Title (Indic)ఏ వుపాయములు మాకిఁకఁ బనికిరావు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ వుపాయములు మాకిఁకఁ బనికిరావు నీవే హరి కావవే నిరుహేతుకమున (॥ఏవు॥) యివల నింద్రియజయం బేడ నే నేడ భువి నింద్రియములతోఁ బుట్టే నీతనువు అవల నిశ్చలబుద్ధి అది యేడ నే నేడ భవము చంచలమనసు పంగెమే యెపుడు (॥ఏవు॥) యెలమిఁ గర్మవిముక్తి యేడ నే నేడ తెలియంగఁ గర్మాధీన మీబ్రదుకు కుళకమగు సాత్త్వికపుగుణ మేడ నే నేడ కలియుగం బిది యిందుఁ గలవాఁడ నేను (॥ఏవు॥) తనివోని ఘోరతప మేడ నే నేడ అనిశంబు నీకు శరణాగతుఁడను యెనలేని శ్రీవేంకటేశ్వరుఁడ నీబిరుదు కనుఁగొనఁగ శరణాగతపారిజాతం English(||pallavi||) e vubāyamulu māgim̐kam̐ banigirāvu nīve hari kāvave niruhedugamuna (||evu||) yivala niṁdriyajayaṁ beḍa ne neḍa bhuvi niṁdriyamuladom̐ buṭṭe nīdanuvu avala niśhchalabuddhi adi yeḍa ne neḍa bhavamu saṁchalamanasu paṁgĕme yĕbuḍu (||evu||) yĕlamim̐ garmavimukti yeḍa ne neḍa tĕliyaṁgam̐ garmādhīna mībradugu kuḽagamagu sāttvigabuguṇa meḍa ne neḍa kaliyugaṁ bidi yiṁdum̐ galavām̐ḍa nenu (||evu||) tanivoni ghoradaba meḍa ne neḍa aniśhaṁbu nīgu śharaṇāgadum̐ḍanu yĕnaleni śhrīveṁkaḍeśhvarum̐ḍa nībirudu kanum̐gŏnam̐ga śharaṇāgadabārijādaṁ