Title (Indic)ఏ వల్ల నౌఁగాము లిఁక నేవి అన్నియు నీలోనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ వల్ల నౌఁగాము లిఁక నేవి అన్నియు నీలోనే శ్రీవల్లభుఁడ నిన్నుఁ జేఱితిమి నేము (॥ఏవ॥) సగుణనిర్గుణములును సావయవనిరవయవ- మగుఁ దర్కవాదకలహములు ఘనము జగములో చదువులును సంశయంబే కాని తెగనీదు నీ మాయ తెలియ వసమా (॥ఏవ॥) వేదమార్గము గొంత వేదబాహ్యము గొంత పోది మతములవారి పోరు ఘనము పాదైన మునిరుషులు బహుముఖములే కాని సోదించి వొకమాట చూపంగ లేరు (॥ఏవ॥) వెస గర్మ మొకవంక విజ్ఞాన మొకవంక వసగావు రెంటి బలవంతములును వసుధ శ్రీవేంకటేశ్వర నీవు గావు మిఁక ముఁసుగు వెట్టినవాదు ముగియదెంతైనా English(||pallavi||) e valla naum̐gāmu lim̐ka nevi anniyu nīlone śhrīvallabhum̐ḍa ninnum̐ jeṟidimi nemu (||eva||) saguṇanirguṇamulunu sāvayavaniravayava- magum̐ dargavādagalahamulu ghanamu jagamulo saduvulunu saṁśhayaṁbe kāni tĕganīdu nī māya tĕliya vasamā (||eva||) vedamārgamu gŏṁta vedabāhyamu gŏṁta podi madamulavāri poru ghanamu pādaina muniruṣhulu bahumukhamule kāni sodiṁchi vŏgamāḍa sūbaṁga leru (||eva||) vĕsa garma mŏgavaṁka vijñāna mŏgavaṁka vasagāvu rĕṁṭi balavaṁtamulunu vasudha śhrīveṁkaḍeśhvara nīvu gāvu mim̐ka mum̐sugu vĕṭṭinavādu mugiyadĕṁtainā