Title (Indic)ఏ సతిఁ బొందవలసో యిదొక నెపము మోసి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ సతిఁ బొందవలసో యిదొక నెపము మోసి రాసి కెక్కవట్టే యాచారాలు సేసేవూ (॥ఏతి॥) చివ్వనఁ దమ్మరసము చీరపై నీవే వుమిసి అవ్వలఁ జెఱఁగు మాసె నని యాడేవు జవ్వనమదము నీకు జాఱీఁ జెంపలవెంటా నవ్వు లెల్లా నేఁడే నీవు నవ్వఁగ వొద్దా (॥ఏతి॥) స్వామిని నిమ్మపంటిరసము పానుపుపైఁ బిండి ఆముకొని కళరేఁ గెనని యాడేవు కామాంధకారము నీకుఁ గన్నులఁ గప్పి వున్నది చేముంచి నీ వుద్దండానఁ జెనక వద్దా (॥ఏతి॥) సరుస శ్రీవేంకటేశ జారించి నా పోఁకముడి తెరవేయు మని సిగ్గు దేర నాడేవు దొరతనపుగర్వము తొట్టీని నిలువెల్లా నిరతి బలిమితోడ నిన్నుఁ గూడ వద్దా English(||pallavi||) e sadim̐ bŏṁdavalaso yidŏga nĕbamu mosi rāsi kĕkkavaṭṭe yāsārālu sesevū (||edi||) sivvanam̐ dammarasamu sīrabai nīve vumisi avvalam̐ jĕṟam̐gu māsĕ nani yāḍevu javvanamadamu nīgu jāṟīm̐ jĕṁpalavĕṁṭā navvu lĕllā nem̐ḍe nīvu navvam̐ga vŏddā (||edi||) svāmini nimmabaṁṭirasamu pānububaim̐ biṁḍi āmugŏni kaḽarem̐ gĕnani yāḍevu kāmāṁdhagāramu nīgum̐ gannulam̐ gappi vunnadi semuṁchi nī vuddaṁḍānam̐ jĕnaga vaddā (||edi||) sarusa śhrīveṁkaḍeśha jāriṁchi nā pom̐kamuḍi tĕraveyu mani siggu dera nāḍevu dŏradanabugarvamu tŏṭṭīni niluvĕllā niradi balimidoḍa ninnum̐ gūḍa vaddā