Title (Indic)ఏ రీతి వేఁడుకొనేవే యిటు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ రీతి వేఁడుకొనేవే యిటు నీవు నీ రతికిఁ గాచుకొని నిలుచున్నవాఁడు (॥॥) చేయివట్టుకొని నీచెక్కునొక్కే రమణుని ఆయములు సోఁక వెంగేలాడితివి చాయలు సన్నలుఁ జూపి సంగడినున్న యతని సోయగపుఁ గన్నులను సొలసితివి (॥॥) తమ్ముల మిడుచు నీ దప్పి దేరిచే విభుని బొమ్మల జంకించి సొలపులఁ దిట్టితి సోమ్ముల నింపుచు నిన్నుఁ జొక్కించే యాతని దొమ్మితోఁ బాదము దొక్కి తొడపై నెక్కితివి (॥॥) చెనకి కాఁగిటగూడి శ్రీవేంకటేశ్వరుని ననుపున నలయించి నవ్వితివి మనసు మర్మమెరిఁగి మన్నించే యీతని తనివార మోవియిచ్చి దక్కఁగొంటివి English(||pallavi||) e rīdi vem̐ḍugŏneve yiḍu nīvu nī radigim̐ gāsugŏni nilusunnavām̐ḍu (||||) seyivaṭṭugŏni nīsĕkkunŏkke ramaṇuni āyamulu som̐ka vĕṁgelāḍidivi sāyalu sannalum̐ jūbi saṁgaḍinunna yadani soyagabum̐ gannulanu sŏlasidivi (||||) tammula miḍusu nī dappi derise vibhuni bŏmmala jaṁkiṁchi sŏlabulam̐ diṭṭidi sommula niṁpusu ninnum̐ jŏkkiṁche yādani dŏmmidom̐ bādamu dŏkki tŏḍabai nĕkkidivi (||||) sĕnagi kām̐giḍagūḍi śhrīveṁkaḍeśhvaruni nanubuna nalayiṁchi navvidivi manasu marmamĕrim̐gi manniṁche yīdani tanivāra moviyichchi dakkam̐gŏṁṭivi