Title (Indic)ఏ పొద్దు చూచిన దేవుఁ డిటానే యారగించు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ పొద్దు చూచిన దేవుఁ డిటానే యారగించు రూపులతోఁ బదివేలు రుచులైనట్లుండెను (॥ఏపొ॥) మేరుమందరాలవలె మెరయు నిడ్డెనలు సూరియచంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించఁగాను బోరన చుక్కలు రాసి వోసినట్లుండెను (॥ఏపొ॥) పలు జలధులవంటి పైఁడివెండిగిన్నెలు వెలిఁగొండలంతలేసి వెన్నముద్దలు బలసిన చిలుపాలు పంచదార గుప్పఁగాను అలరు వెన్నెలరస మందిచ్చినట్లుండెను (॥ఏపొ॥) పండిన పంటలవంటి పచ్చళ్ళుఁ గూరలును వండి యలమేలుమంగ వడ్డించఁగా అండనే శ్రీవేంకటేశుఁ డారగించీ మిగులఁగ దండిగా దాసులకెల్లా దాఁచినట్లుండెను English(||pallavi||) e pŏddu sūsina devum̐ ḍiḍāne yāragiṁchu rūbuladom̐ badivelu rusulainaṭluṁḍĕnu (||ebŏ||) merumaṁdarālavalĕ mĕrayu niḍḍĕnalu sūriyasaṁdrulavaṁṭi suṭṭum̐baḽḽelu āranirājānnālu aṁdubai vaḍḍiṁcham̐gānu borana sukkalu rāsi vosinaṭluṁḍĕnu (||ebŏ||) palu jaladhulavaṁṭi paim̐ḍivĕṁḍiginnĕlu vĕlim̐gŏṁḍalaṁtalesi vĕnnamuddalu balasina silubālu paṁchadāra guppam̐gānu alaru vĕnnĕlarasa maṁdichchinaṭluṁḍĕnu (||ebŏ||) paṁḍina paṁṭalavaṁṭi pachchaḽḽum̐ gūralunu vaṁḍi yalamelumaṁga vaḍḍiṁcham̐gā aṁḍane śhrīveṁkaḍeśhum̐ ḍāragiṁchī migulam̐ga daṁḍigā dāsulagĕllā dām̐sinaṭluṁḍĕnu