Title (Indic)ఏ పరాకున నున్నాఁడో యేమి సేసీనో తాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ పరాకున నున్నాఁడో యేమి సేసీనో తాను చేపట్టి మన్నించుఁగాని చెప్పరే యీ కతలు (॥ఏప॥) పొలఁతి మెయి వలపులే పులకలై మొలచెను కలసేటి కోరికలె కతతలాయను తలపోఁత లుమ్మగిలి తరచుఁ జెమటలాయ చెలులాల విభునికిఁ జెప్పరే యీకతలు (॥ఏప॥) కామిని తమకములె గట్టి చన్నులై పెరిగె నాముకొన్న సరసాలే నవ్వులాయను తేమరేఁగే కరఁగులే తేనియలై మోవినూరె చేముంచి యాతనితోడఁ జెప్పరే యీకతలు (॥ఏప॥) నొరిది నాసలు కనుచూపులై యెదురుకొనె పెరరేఁపు నుప్పతిల్లి పిలుపులాయ ఇరవై శ్రీవేంకటేశుఁ డిట్టె వచ్చి యింతి నేలె సిరుల నితని కింకాఁ జెప్పరే యీకతలు English(||pallavi||) e parāguna nunnām̐ḍo yemi sesīno tānu sebaṭṭi manniṁchum̐gāni sĕppare yī kadalu (||eba||) pŏlam̐ti mĕyi valabule pulagalai mŏlasĕnu kalaseḍi korigalĕ kadatalāyanu talabom̐ta lummagili tarasum̐ jĕmaḍalāya sĕlulāla vibhunigim̐ jĕppare yīgadalu (||eba||) kāmini tamagamulĕ gaṭṭi sannulai pĕrigĕ nāmugŏnna sarasāle navvulāyanu temarem̐ge karam̐gule teniyalai movinūrĕ semuṁchi yādanidoḍam̐ jĕppare yīgadalu (||eba||) nŏridi nāsalu kanusūbulai yĕdurugŏnĕ pĕrarem̐pu nuppadilli pilubulāya iravai śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ vachchi yiṁti nelĕ sirula nidani kiṁkām̐ jĕppare yīgadalu