Title (Indic)ఏ పాటి తన కర్మ మాపాటి కాపాటె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ పాటి తన కర్మ మాపాటి కాపాటె శ్రీపతిదాసుఁ డయితే చిహ్న లిటువలెఁ బో (॥ఏపా॥) అందరిని నిర్మలులే యని తలఁచిన తన- నింద లేని మనసే నిర్మలము మందలించి లోకులతో మంచి మాఁట లాడితేను బందెలేని తన నోరే భావించ మంచిది (॥ఏపా॥) అంతటాను హరి యున్నాఁడని చూచినఁ దన- యంతరంగమున నుండు నీ దేవుఁడే చింతించి యీ జగము చేకొని పావనమంటే పంతపు తన దేహముఁ బరమపావనమే (॥ఏపా॥) పుట్టితేఁ దన పాలికిఁ బుట్టే నీ ప్రపంచము దట్టమైన పుట్టెల్లఁ దనతోడిదే యిట్టే శ్రీవేంకటేశుఁ డిచ్చినాఁడీ గుణము పట్టమై నావద్దనుండు పరమవిజ్ఞానము English(||pallavi||) e pāḍi tana karma mābāḍi kābāḍĕ śhrībadidāsum̐ ḍayide sihna liḍuvalĕm̐ bo (||ebā||) aṁdarini nirmalule yani talam̐sina tana- niṁda leni manase nirmalamu maṁdaliṁchi logulado maṁchi mām̐ṭa lāḍidenu baṁdĕleni tana nore bhāviṁcha maṁchidi (||ebā||) aṁtaḍānu hari yunnām̐ḍani sūsinam̐ dana- yaṁtaraṁgamuna nuṁḍu nī devum̐ḍe siṁtiṁchi yī jagamu segŏni pāvanamaṁṭe paṁtabu tana dehamum̐ baramabāvaname (||ebā||) puṭṭidem̐ dana pāligim̐ buṭṭe nī prabaṁchamu daṭṭamaina puṭṭĕllam̐ danadoḍide yiṭṭe śhrīveṁkaḍeśhum̐ ḍichchinām̐ḍī guṇamu paṭṭamai nāvaddanuṁḍu paramavijñānamu