Title (Indic)ఏ మయ్యా వో యయ్య యే మయ్యా నే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ మయ్యా వో యయ్య యే మయ్యా నే- మేమి బాఁతి నీకు నేల పిలిచే వయ్యా (॥ఏ మయ్యా॥) నీ సరివారమా నేము నిండు సరసము లాడ ఆసలఁ బెట్టక మాను మన్నామానవు కాసు సేయనిపనికి కమ్మటి నాన వెట్టేవు వేసరక నీవు మావెంట వెంటఁ బాయవు (॥ఏ మయ్యా॥) చనవరులమా నేము సంగడి నీతోఁ గూచుండ పొనిగి వోయినసుద్ది పో నియ్యవు ననిచినవావు లెల్ల నాటికి నాఁడే కాక కొనవేసి మమ్ము నేల కూరిమి గొసరేవు (॥ఏ మయ్యా॥) నిన్ను మీరెవారమా నేఁ డేమి సేసినాను కన్నులఁ దప్పక చూచి కలసితివి యిన్నిటా శ్రీవెంకటేశ యిందరు నిట్టె చూడఁగ నన్ను మన్నించి నాతోనె నవ్వులు నవ్వేవు English(||pallavi||) e mayyā vo yayya ye mayyā ne- memi bām̐ti nīgu nela pilise vayyā (||e mayyā||) nī sarivāramā nemu niṁḍu sarasamu lāḍa āsalam̐ bĕṭṭaga mānu mannāmānavu kāsu seyanibanigi kammaḍi nāna vĕṭṭevu vesaraga nīvu māvĕṁṭa vĕṁṭam̐ bāyavu (||e mayyā||) sanavarulamā nemu saṁgaḍi nīdom̐ gūsuṁḍa pŏnigi voyinasuddi po niyyavu nanisinavāvu lĕlla nāḍigi nām̐ḍe kāga kŏnavesi mammu nela kūrimi gŏsarevu (||e mayyā||) ninnu mīrĕvāramā nem̐ ḍemi sesinānu kannulam̐ dappaga sūsi kalasidivi yinniḍā śhrīvĕṁkaḍeśha yiṁdaru niṭṭĕ sūḍam̐ga nannu manniṁchi nādonĕ navvulu navvevu