Title (Indic)ఏ మంచిదాననంటా నన్నింతగా మన్నించితివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ మంచిదాననంటా నన్నింతగా మన్నించితివి కామించి నీ కృప నాపైఁ గలిగే నీవేళను (॥ఏమం॥) కోరి నాపయ్యదలోనికుచములే కావా సారెసారె నిన్ను నొత్తి సాదించినవి నారుకొన్ననాసెలవినవ్వు లివియే కావా వారించరాక నిన్ను వలలఁబెట్టినవి (॥ఏమం॥) చొక్కపునాకనుఁగోనచూపు లివియే కావా ఇక్కువల నిన్ను బయలీఁదించినవి పక్కన నాపెదవుల పైమాటలే కావా చిక్కించి నీమనసెల్లా జిమ్మిరేఁచినవి (॥ఏమం॥) మించిననారతులసమేళము లివె కావా పొంచి నీకు చెమటలు పుట్టించినవి అంచెల శ్రీవేంకటేశ యలమేల్మంగపతివి యెంచేనాపొందులే కావా ఇంపులు నించినవి English(||pallavi||) e maṁchidānanaṁṭā nanniṁtagā manniṁchidivi kāmiṁchi nī kṛpa nābaim̐ galige nīveḽanu (||emaṁ||) kori nābayyadalonigusamule kāvā sārĕsārĕ ninnu nŏtti sādiṁchinavi nārugŏnnanāsĕlavinavvu liviye kāvā vāriṁcharāga ninnu valalam̐bĕṭṭinavi (||emaṁ||) sŏkkabunāganum̐gonasūbu liviye kāvā ikkuvala ninnu bayalīm̐diṁchinavi pakkana nābĕdavula paimāḍale kāvā sikkiṁchi nīmanasĕllā jimmirem̐sinavi (||emaṁ||) miṁchinanāradulasameḽamu livĕ kāvā pŏṁchi nīgu sĕmaḍalu puṭṭiṁchinavi aṁchĕla śhrīveṁkaḍeśha yalamelmaṁgabadivi yĕṁchenābŏṁdule kāvā iṁpulu niṁchinavi