Title (Indic)ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి ఆ కడ నాఁతడె హరి నెఱిగినవాఁడు (॥ఏ కుల॥) పరగినసత్యసంపన్నుఁడైనవాఁడే పరనిందసేయఁ దత్పరుఁడుగాని వాఁడు అరుదైన భూతదయానిధియగువాఁడే పరులుదానేయని భావించు వాఁడు (॥ఏ కుల॥) నిర్మలుఁడై యాత్మనియతి గలుగువాఁడే ధర్మతత్పరబుధ్ధిఁ దగిలిన వాఁడు కర్మమార్గములు గడవనివాఁడే మర్మమై హరిభక్తి మఱవని వాఁడు (॥ఏ కుల॥) జగతిపై హితముగాఁ జరియించు వాఁడే పగలేక మతిలోన బ్రతికిన వాఁడు తెగి సకలము నాత్మ దెలిసివాఁడే తగిలి వేంకటేశుదాసుఁడయిన వాఁడు English(||pallavi||) e kulajum̐ḍemi yĕvvam̐ḍainanemi ā kaḍa nām̐taḍĕ hari nĕṟiginavām̐ḍu (||e kula||) paraginasatyasaṁpannum̐ḍainavām̐ḍe paraniṁdaseyam̐ datparum̐ḍugāni vām̐ḍu arudaina bhūdadayānidhiyaguvām̐ḍe paruludāneyani bhāviṁchu vām̐ḍu (||e kula||) nirmalum̐ḍai yātmaniyadi galuguvām̐ḍe dharmadatparabudhdhim̐ dagilina vām̐ḍu karmamārgamulu gaḍavanivām̐ḍe marmamai haribhakti maṟavani vām̐ḍu (||e kula||) jagadibai hidamugām̐ jariyiṁchu vām̐ḍe pagalega madilona bradigina vām̐ḍu tĕgi sagalamu nātma dĕlisivām̐ḍe tagili veṁkaḍeśhudāsum̐ḍayina vām̐ḍu