Title (Indic)ఏ కాలమేది దనకెట్ల సుఖమైయుండు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ కాలమేది దనకెట్ల సుఖమైయుండు - నా కాలవశతఁ దానట్లుండవలనె (॥ఏకా॥) బలువియోగాగ్ని దలఁపంగ నెట్టిదొకాని చలిగాలి యెండనుచు జాలిఁ బడవలనె వలరాజుకోపమెటువంటిదో పడఁతులకు తలిరాకు చేఁదనుచుఁ దలపోయవలనె (॥ఏకా॥) భావంబు తలపోఁత బలిమెట్టిదోకాని నోవి దోఁపనిచోట నొచ్చెననవలనె ఈ విరహపరితాపమిఁకనెట్టిదో కాని కోవిలల కూఁతలకుఁ గోపించవలనె (॥ఏకా॥) తిరువేంకటేశుకృప తియ్యమెట్టిదొ కాని చిరునవ్వు మోవిపైఁ జెరలాడవలనె సురతసౌభాగ్యముల సొంపులెట్టివొ కాని మురిపెంపుఁ గనుచూపు ముయ్యఁగావలనె English(||pallavi||) e kālamedi danagĕṭla sukhamaiyuṁḍu - nā kālavaśhadam̐ dānaṭluṁḍavalanĕ (||egā||) baluviyogāgni dalam̐paṁga nĕṭṭidŏgāni saligāli yĕṁḍanusu jālim̐ baḍavalanĕ valarājugobamĕḍuvaṁṭido paḍam̐tulagu talirāgu sem̐danusum̐ dalaboyavalanĕ (||egā||) bhāvaṁbu talabom̐ta balimĕṭṭidogāni novi dom̐panisoḍa nŏchchĕnanavalanĕ ī virahabaridābamim̐kanĕṭṭido kāni kovilala kūm̐talagum̐ gobiṁchavalanĕ (||egā||) tiruveṁkaḍeśhukṛpa tiyyamĕṭṭidŏ kāni sirunavvu movibaim̐ jĕralāḍavalanĕ suradasaubhāgyamula sŏṁpulĕṭṭivŏ kāni muribĕṁpum̐ ganusūbu muyyam̐gāvalanĕ