Title (Indic)ఏ గతి నుద్ధరించేవో యింతటిమీఁదట మమ్ము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ గతి నుద్ధరించేవో యింతటిమీఁదట మమ్ము భోగపుఁ గోరికలచేఁ బొలిసెఁ బో ప(గ?)తులు (॥ఏగతి॥) పరగి నాలుకసొంపు పరసిపోయ పరులనే నుతియించి పలుమారును విరసపుఁబాపములవినికిచే వీనులెల్లాఁ గొరమాలె మాకు నేఁటి కులాచారము (॥ఏగతి॥) మొక్కలాన పరధనమునకుఁ జాఁచిచాఁచి ఎక్కువఁజేతులమహి మెందో పోయ తక్కక పరస్త్రీలఁ దలఁచి మనసు బుద్ధి ముక్కపోయ మాకు నేఁటి ముందటిపుణ్యాలు (॥ఏగతి॥) యెప్పుడు నీచులయిండ్లకెడతాఁకి పాదములు తప్పనితపములెల్లఁ దలఁగిపోయె యిప్పుడె శ్రీవేంకటేశ యిటునిన్నుఁ గొలువఁగా నెప్పున నేఁజేసినట్టి నేరమెల్లా నణఁగె English(||pallavi||) e gadi nuddhariṁchevo yiṁtaḍimīm̐daḍa mammu bhogabum̐ gorigalasem̐ bŏlisĕm̐ bo pa(ga?)tulu (||egadi||) paragi nālugasŏṁpu parasiboya parulane nudiyiṁchi palumārunu virasabum̐bābamulavinigise vīnulĕllām̐ gŏramālĕ māgu nem̐ṭi kulāsāramu (||egadi||) mŏkkalāna paradhanamunagum̐ jām̐sisām̐si ĕkkuvam̐jedulamahi mĕṁdo poya takkaga parastrīlam̐ dalam̐si manasu buddhi mukkaboya māgu nem̐ṭi muṁdaḍibuṇyālu (||egadi||) yĕppuḍu nīsulayiṁḍlagĕḍadām̐ki pādamulu tappanidabamulĕllam̐ dalam̐giboyĕ yippuḍĕ śhrīveṁkaḍeśha yiḍuninnum̐ gŏluvam̐gā nĕppuna nem̐jesinaṭṭi neramĕllā naṇam̐gĕ