Title (Indic)ఏ గతి నుద్ధరించేవో యింతటిమీఁదట మమ్ము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ గతి నుద్ధరించేవో యింతటిమీఁదట మమ్ము భోగపుఁ గోరికలచే బొలిసెఁ బో పనులు (॥ఏగ॥) పరగి నాలుకసొంపు పరసిపోయ పరులనే నుతియించి పలుమారును విరసపుఁ బాపముల వినికిచే వీనులెల్లాఁ గొరమాలె మాకు నేఁటి కులాచారములు (॥ఏగ॥) మెుక్కలానఁ బరధనమునకుఁ జాఁచి చాఁచి యెక్కువఁ జేతుల మహిమెందో పోయ తక్కక పరస్త్రీలఁ దలఁచి మనసు బుద్ది ముక్కపోయ మాకు నేఁటిముందరి పుణ్యములు (॥ఏగ॥) యెప్పుడు నీచుల ఇండ్ల కెడతాఁకి పాదములు తప్పని తపములెల్లాఁ దలఁగిపోయ యిప్పుడే శ్రీవేంకటేశ యిటు నిన్నుఁ గొలువఁగా నెప్పున నేఁ జేసినట్టి నేరమెల్లా నడఁగె English(||pallavi||) e gadi nuddhariṁchevo yiṁtaḍimīm̐daḍa mammu bhogabum̐ gorigalase bŏlisĕm̐ bo panulu (||ega||) paragi nālugasŏṁpu parasiboya parulane nudiyiṁchi palumārunu virasabum̐ bābamula vinikise vīnulĕllām̐ gŏramālĕ māgu nem̐ṭi kulāsāramulu (||ega||) mĕుkkalānam̐ baradhanamunagum̐ jām̐si sām̐si yĕkkuvam̐ jedula mahimĕṁdo poya takkaga parastrīlam̐ dalam̐si manasu buddi mukkaboya māgu nem̐ṭimuṁdari puṇyamulu (||ega||) yĕppuḍu nīsula iṁḍla kĕḍadām̐ki pādamulu tappani tabamulĕllām̐ dalam̐giboya yippuḍe śhrīveṁkaḍeśha yiḍu ninnum̐ gŏluvam̐gā nĕppuna nem̐ jesinaṭṭi neramĕllā naḍam̐gĕ