Title (Indic)ఏ దుపాయము యే నిన్నుఁ జేరుటకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ దుపాయము యే నిన్నుఁ జేరుటకు ఆదినంత్యములేని అచ్యుతమూరితివి (॥ఏదు॥) వెలయ నీగుణములు వినుతించేనంటే తెలియ నీవు గుణాతీతుఁడవు చెలరేఁగి నిను మతిఁ జింతించేనంటే మలసి నీ వచింత్య మహిముఁడవు (॥ఏదు॥) పొదిగి చేతుల నిన్నుఁ బూజించేనంటే కదిసి నీవు విశ్వకాయుఁడవు అదన నేమైన సమర్పించేనంటే సదరమై అవాప్త సకలకాముఁడవు (॥ఏదు॥) కన్నుల చేత నిన్నుఁ గనుఁగొనేనంటే సన్నిధి దొరక నగోచరుఁడవు యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవని వన్నెల శరణనే వాక్యమే చాలు English(||pallavi||) e dubāyamu ye ninnum̐ jeruḍagu ādinaṁtyamuleni achyudamūridivi (||edu||) vĕlaya nīguṇamulu vinudiṁchenaṁṭe tĕliya nīvu guṇādīdum̐ḍavu sĕlarem̐gi ninu madim̐ jiṁtiṁchenaṁṭe malasi nī vasiṁtya mahimum̐ḍavu (||edu||) pŏdigi sedula ninnum̐ būjiṁchenaṁṭe kadisi nīvu viśhvagāyum̐ḍavu adana nemaina samarbiṁchenaṁṭe sadaramai avāpta sagalagāmum̐ḍavu (||edu||) kannula seda ninnum̐ ganum̐gŏnenaṁṭe sannidhi dŏraga nagosarum̐ḍavu yinniḍānu śhrīveṁkaḍeśha nīvu galavani vannĕla śharaṇane vākyame sālu