Title (Indic)ఏ దెస మోక్షము లేదు యెవ్వరికి ననేరు మీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ దెస మోక్షము లేదు యెవ్వరికి ననేరు మీ- వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసేరా (॥ఏదె॥) అంతా బ్రహ్మమైతే నాతుమా వొక్కటియైతే చింతింప గురుఁడు లేఁడు శిష్యుడూ లేఁడు బంతినే ముక్తుఁడూ లేఁడు బద్ధుఁడూ లేఁడిట్లయితే వంతుల సత్కర్మమెల్ల వఱతపాలాయఁబో (॥ఏదె॥) యిహమెల్లాఁ గల్లనేరు యేఁటికిఁ బుట్టినవారు సహజమే యిదనేరు చావనేఁటికి మహి మీకు బోధించిన మహాత్ము శంకరాచార్యుఁ- డహరహ మేమైయున్నా నాతనికేది గతి (?) (॥ఏదె॥) కొందరికి సుఖమిది కొందరికి దుఃఖమిది యిందుఁ జిక్కి బ్రహ్మమునకీ ఘోరమేలా అందిన శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డొక్కఁడింతే మందలించి కొలువరు మంటికా మీ జ్ఞానము English(||pallavi||) e dĕsa mokṣhamu ledu yĕvvarigi naneru mī- vedāṁtaśhravaṇamu vĕṭṭigim̐ jeserā (||edĕ||) aṁtā brahmamaide nādumā vŏkkaḍiyaide siṁtiṁpa gurum̐ḍu lem̐ḍu śhiṣhyuḍū lem̐ḍu baṁtine muktum̐ḍū lem̐ḍu baddhum̐ḍū lem̐ḍiṭlayide vaṁtula satkarmamĕlla vaṟadabālāyam̐bo (||edĕ||) yihamĕllām̐ gallaneru yem̐ṭigim̐ buṭṭinavāru sahajame yidaneru sāvanem̐ṭigi mahi mīgu bodhiṁchina mahātmu śhaṁkarāsāryum̐- ḍaharaha memaiyunnā nādanigedi gadi (?) (||edĕ||) kŏṁdarigi sukhamidi kŏṁdarigi duḥkhamidi yiṁdum̐ jikki brahmamunagī ghoramelā aṁdina śhrīveṁkaḍeśhum̐ ḍaṁtarātmum̐ ḍŏkkam̐ḍiṁte maṁdaliṁchi kŏluvaru maṁṭigā mī jñānamu