Title (Indic)ఏ దైవము శ్రీపాదన్న(న?)ఖమునఁ బుట్టినగంగ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ దైవము శ్రీపాదన్న(న?)ఖమునఁ బుట్టినగంగ- త్రిలోకపావనము చేయను త్రిపథగామిని ఆయమ యే దైవమునాభినలినంబున జనియించిన అజుండు- అఖిలాండంబులు సృజియింప నధిపతి ఆయమ* (॥ఏదై॥) యేదైవమువురస్థలంబు దనకును మందిరమైన యిందిర మాతయయ్యే యీజగంబుల కెల్లను యేదైవము అవలోకన మింద్రాదిది విజగణంబుల కెల్లప్పుడును సుఖంబు లాపాదించును (॥ఏదై॥) యేదైవము దేహవస్తువని అనిమిషులందరుఁ గూడి శ్రీనారాయణ దేవుండని నమ్మి యుండుదురు ఆదేవుఁడే సిరుల కనంతవరదుఁడు తిరువేంకట- గిరినాథుఁడుభయ విభూతినాథుఁడే నానాథుఁడు English(||pallavi||) e daivamu śhrībādanna(na?)khamunam̐ buṭṭinagaṁga- trilogabāvanamu seyanu tribathagāmini āyama ye daivamunābhinalinaṁbuna janiyiṁchina ajuṁḍu- akhilāṁḍaṁbulu sṛjiyiṁpa nadhibadi āyama* (||edai||) yedaivamuvurasthalaṁbu danagunu maṁdiramaina yiṁdira mādayayye yījagaṁbula kĕllanu yedaivamu avalogana miṁdrādidi vijagaṇaṁbula kĕllappuḍunu sukhaṁbu lābādiṁchunu (||edai||) yedaivamu dehavastuvani animiṣhulaṁdarum̐ gūḍi śhrīnārāyaṇa devuṁḍani nammi yuṁḍuduru ādevum̐ḍe sirula kanaṁtavaradum̐ḍu tiruveṁkaḍa- girināthum̐ḍubhaya vibhūdināthum̐ḍe nānāthum̐ḍu