Title (Indic)ఏ బలిమి నమ్మి వెరపెరఁగరు దేహులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ బలిమి నమ్మి వెరపెరఁగరు దేహులాల గాబువలెఁ బెరిగేరు కాలము విూ చుట్టమా (॥ఏబ॥) చెలరేఁగి దానములు సేసినట్టి బలిమో అలరి కర్మము సేసినట్టి బలమో చలపట్టి తపము లాచరించిన బలిమో కొలఁదిలేక సురలఁ గొలిచిన బలిమో (॥ఏబ॥) ధీరత సుజ్ఞానము దెలిసిన బలిమో కోరక విరక్తి గైకొన్నబలిమో శూరత లోకానకెల్లఁ జుట్టమైన బలివమో వూరకే బ్రహ్మకల్పము లుండేటట్టి బలిమో (॥ఏబ॥) పరగ శ్రీపతినామపఠనము బలిమో హరిదాసుల శరణన్నట్టి బలిమో సిరుల శ్రీవేంకటేశు సేవచేసిన బలిమో గురుభక్తితోడ నెక్కువయైన బలిమో English(||pallavi||) e balimi nammi vĕrabĕram̐garu dehulāla gābuvalĕm̐ bĕrigeru kālamu viూ suṭṭamā (||eba||) sĕlarem̐gi dānamulu sesinaṭṭi balimo alari karmamu sesinaṭṭi balamo salabaṭṭi tabamu lāsariṁchina balimo kŏlam̐dilega suralam̐ gŏlisina balimo (||eba||) dhīrada sujñānamu dĕlisina balimo koraga virakti gaigŏnnabalimo śhūrada logānagĕllam̐ juṭṭamaina balivamo vūrage brahmagalbamu luṁḍeḍaṭṭi balimo (||eba||) paraga śhrībadināmabaṭhanamu balimo haridāsula śharaṇannaṭṭi balimo sirula śhrīveṁkaḍeśhu sevasesina balimo gurubhaktidoḍa nĕkkuvayaina balimo