Title (Indic)ఏ బాస కియ్యకొనేవే యిప్పుడు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ బాస కియ్యకొనేవే యిప్పుడు నీవు వాబలిమి మాటల వాదుకోపఁ గాని (॥ఏబా॥) నెట్టన నీవు నన్నాడే నిందలెల్లాఁ దప్పదని చుట్టి మరుగుడి వాసి చొచ్చి వెళ్ళేవా నట్టనడుమ నేనైనా ననలయలుగులను కిట్టి నానిజము మించ గెలిచేఁ గాని (॥ఏబా॥) ఆలాగువాఁడ నేనని చిలుకజోదుల వాలు తిరుమిక్కిళ్ళకు(?) వడి నిల్చేవా వాలాయించి నేనైనా నావల్లఁ గల్లలేకుండా బాలకోవిలభ్రతముఁ బలికించేఁ గాని (॥ఏబా॥) ఇలనేఁ గపటినని యీపూవుఁ దేనెనీటను నెలకొని నీవు మునిఁగి లేచేవా కలసితి నేను శ్రీ వేంకటపతినిపుడని తొలుత నీచన్నుదిబ్బాలు దొడికేఁ గాని English(||pallavi||) e bāsa kiyyagŏneve yippuḍu nīvu vābalimi māḍala vādugobam̐ gāni (||ebā||) nĕṭṭana nīvu nannāḍe niṁdalĕllām̐ dappadani suṭṭi maruguḍi vāsi sŏchchi vĕḽḽevā naṭṭanaḍuma nenainā nanalayalugulanu kiṭṭi nānijamu miṁcha gĕlisem̐ gāni (||ebā||) ālāguvām̐ḍa nenani silugajodula vālu tirumikkiḽḽagu(?) vaḍi nilsevā vālāyiṁchi nenainā nāvallam̐ gallaleguṁḍā bālagovilabhradamum̐ baligiṁchem̐ gāni (||ebā||) ilanem̐ gabaḍinani yībūvum̐ denĕnīḍanu nĕlagŏni nīvu munim̐gi lesevā kalasidi nenu śhrī veṁkaḍabadinibuḍani tŏluda nīsannudibbālu dŏḍigem̐ gāni