Title (Indic)ఎఱుఁగుదు నీ సుద్దు లేమి చెప్పేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎఱుఁగుదు నీ సుద్దు లేమి చెప్పేవు జఱపులఁ బెట్టితే చలము రేఁగీని (॥॥) వంచి చల్లని నీళ్ళేకావా కొచ్చి పారేవి మంచి నీ మాటలేకావా మరిగించేవి కొంచి నీవు నను వేఁడుకొనకంత సారెసారె యెంచ నాచెక్కుల గోళ్ళింతలో నాఁటీని (॥॥) ఇసుమంత చల్లే కాదా ఇన్నిపాలూఁ బేరించేది పసని నీ నవ్వేకాదా భ్రమయించేది ముసరి నాచన్నులివి ముట్టి యానలు వెట్టకు వెస నీగట్టిచేతులు కసుఁగందించీని (॥॥) మాఁగితే కాయే కాదా మంచిఫల మయ్యేది కాఁగిటి నీపొందే కాదా కరఁగించేది చేఁగదేర నేలితివి శ్రీవేంకటేశ నన్ను రేఁగి రేఁగి కొసరకు రెట్టించీ వలపు English(||pallavi||) ĕṟum̐gudu nī suddu lemi sĕppevu jaṟabulam̐ bĕṭṭide salamu rem̐gīni (||||) vaṁchi sallani nīḽḽegāvā kŏchchi pārevi maṁchi nī māḍalegāvā marigiṁchevi kŏṁchi nīvu nanu vem̐ḍugŏnagaṁta sārĕsārĕ yĕṁcha nāsĕkkula goḽḽiṁtalo nām̐ṭīni (||||) isumaṁta salle kādā innibālūm̐ beriṁchedi pasani nī navvegādā bhramayiṁchedi musari nāsannulivi muṭṭi yānalu vĕṭṭagu vĕsa nīgaṭṭisedulu kasum̐gaṁdiṁchīni (||||) mām̐gide kāye kādā maṁchiphala mayyedi kām̐giḍi nībŏṁde kādā karam̐giṁchedi sem̐gadera nelidivi śhrīveṁkaḍeśha nannu rem̐gi rem̐gi kŏsaragu rĕṭṭiṁchī valabu