Title (Indic)ఎఱఁగవా నాచేత నింతేశాడించుకోనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎఱఁగవా నాచేత నింతేశాడించుకోనేల మఱచిన పనులకు మగిడి చూడనేలా (॥॥) పైకొని నాతో నీవు బాసలు సేయఁగనేల నీకు నిజమే కలితే నిష్టూరమేల యేకమైన పొందులకు యెడమాటలాడనేల సాకిరిలేని పనికి సాదించనేల (॥॥) కొన్నది కోలై నందుకు కొలఁది వెట్టిఁగనేల చిన్ననాటి సుద్దులకు సిగ్గులేల అన్నిటా నేర్పరి వైతే నంతనీకు లోఁగనేల నిన్నటి చీఁకటికి నేఁడు దీపమేలా (॥॥) వేడుకకాఁడవు నీవు వెఱపులు మరి యేల కూడితివి నన్ను నిఁకఁ గొసర నేల పాడితో నడచే నీకు పంతములు మరి యాల వాడికె శ్రీవేంకటేశ వంకలొత్తనేలా English(||pallavi||) ĕṟam̐gavā nāseda niṁteśhāḍiṁchugonela maṟasina panulagu magiḍi sūḍanelā (||||) paigŏni nādo nīvu bāsalu seyam̐ganela nīgu nijame kalide niṣhṭūramela yegamaina pŏṁdulagu yĕḍamāḍalāḍanela sāgirileni panigi sādiṁchanela (||||) kŏnnadi kolai naṁdugu kŏlam̐di vĕṭṭim̐ganela sinnanāḍi suddulagu siggulela anniḍā nerbari vaide naṁtanīgu lom̐ganela ninnaḍi sīm̐kaḍigi nem̐ḍu dībamelā (||||) veḍugagām̐ḍavu nīvu vĕṟabulu mari yela kūḍidivi nannu nim̐kam̐ gŏsara nela pāḍido naḍase nīgu paṁtamulu mari yāla vāḍigĕ śhrīveṁkaḍeśha vaṁkalŏttanelā