Title (Indic)దొరకె మాపాలికిఁ గందువయర్థము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దొరకె మాపాలికిఁ గందువయర్థము దరిదాపై యుండిన తత్త్వార్థము (॥దొర॥) తిరముగ నల్లదీవిఁ దెచ్చిన యర్థమిదివో విరజవోడరేవున వెళ్లినర్థము పరమభాగవతులు పాఁతినర్థమిదివో పురుషోత్తముఁడనేటి పురుషార్థము (॥దొర॥) చందపువేదముల(లు ? ) శాసనము వేసినర్థము ముందు సుముద్రల కెల్లా మొదలర్థము అందరి యాత్మలనేటి అంగళ్లలోనియర్థము యెందు సహస్రనామపు టెన్నికర్థము (॥దొర॥) కొలచి బ్రహ్మాండముల కొప్పెరలో నర్థము యిల నిహపరముల కెక్కినర్థము యెలమి హీనునినై న యెక్కుడుసేసే యర్థము అలరి శ్రీవేంకటేశుఁడై న యర్థము English(||pallavi||) dŏragĕ mābāligim̐ gaṁduvayardhamu daridābai yuṁḍina tattvārdhamu (||dŏra||) tiramuga nalladīvim̐ dĕchchina yardhamidivo virajavoḍarevuna vĕḽlinardhamu paramabhāgavadulu pām̐tinardhamidivo puruṣhottamum̐ḍaneḍi puruṣhārdhamu (||dŏra||) saṁdabuvedamula(lu ? ) śhāsanamu vesinardhamu muṁdu sumudrala kĕllā mŏdalardhamu aṁdari yātmalaneḍi aṁgaḽlaloniyardhamu yĕṁdu sahasranāmabu ṭĕnnigardhamu (||dŏra||) kŏlasi brahmāṁḍamula kŏppĕralo nardhamu yila nihabaramula kĕkkinardhamu yĕlami hīnuninai na yĕkkuḍusese yardhamu alari śhrīveṁkaḍeśhum̐ḍai na yardhamu