Title (Indic)దేవ నీవిచ్చేయందుకు దీనికిఁ గా నింతయేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దేవ నీవిచ్చేయందుకు దీనికిఁ గా నింతయేల యేవేళ మాయెరుకలు యెందుకుఁ గొలుపును (॥దేవ॥) యెవ్వరివసములు బుద్దెరిఁగినడచేమన యివ్వల నారాయణ నీవియ్యక లేదు దవ్వు చేరువ మనసు తనయిచ్చయితేఁ గనక రవ్వగ మృగాదులెల్ల రాజ్యమేలనేరవా (॥దేవ॥) సారేకు నిన్నుఁదలపించ జంతువులవసమా కేరి నీవు జిహ్వఁ బరికించఁగాఁగాక యీరీతి లోకమెల్లాఁ దమయిచ్చకొలఁదులనయితే దూరానఁ గొక్కెరలు చదవవా వేదాలు (॥దేవ॥) యిందరిపాపపుణ్యాలు యిన్నియు నీచేఁతలే కుందవ స్వతంత్రులు గారు గాన చందపు శ్రీవేంకటేశ శరణంటి నిదె నీకు చెంది నీవే కాతుగాక చేఁతలూను వలెనా English(||pallavi||) deva nīvichcheyaṁdugu dīnigim̐ gā niṁtayela yeveḽa māyĕrugalu yĕṁdugum̐ gŏlubunu (||deva||) yĕvvarivasamulu buddĕrim̐ginaḍasemana yivvala nārāyaṇa nīviyyaga ledu davvu seruva manasu tanayichchayidem̐ ganaga ravvaga mṛgādulĕlla rājyamelaneravā (||deva||) sāregu ninnum̐dalabiṁcha jaṁtuvulavasamā keri nīvu jihvam̐ barigiṁcham̐gām̐gāga yīrīdi logamĕllām̐ damayichchagŏlam̐dulanayide dūrānam̐ gŏkkĕralu sadavavā vedālu (||deva||) yiṁdaribābabuṇyālu yinniyu nīsem̐tale kuṁdava svadaṁtrulu gāru gāna saṁdabu śhrīveṁkaḍeśha śharaṇaṁṭi nidĕ nīgu sĕṁdi nīve kādugāga sem̐talūnu valĕnā