Title (Indic)దేహము సమ్మంధము యివి దేహికిఁ బనిలేదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దేహము సమ్మంధము యివి దేహికిఁ బనిలేదు వూహించ నేర్చినవారలే వోరుచుకుందురయ్యా (॥దేహ॥) విడువవు శీతోష్ణంబులు విడువవు సుఖదుఃఖంబులు వెడవెడ మరణభయంబులు విడిచినయందాఁకా వుడుగవు కాంక్షలు మమతలు నుద్యోగంబులు చింతలు పొడవగు విరక్తి తనలోఁ బొడమినయందాఁకా (॥దేహ॥) మానదు చిత్తవికారము మానదు దుర్గణదోషము మానదు భోగము లన్నియు మానినయందాఁకా పోనీదు సేసిన దురితము పోనీదు వ్రాఁతఫలంబును పూనిన తన యజ్ఞానము పోయినయందాఁకా (॥దేహ॥) తెగవటు భవబంధంబులు తెగ వెడయని గర్వంబులు నిగిడిన యీ యీత్మజ్ఞానము నీవిచ్చినయందాఁకా జగదేకవిభుఁడ శ్రీవేంకటేశ్వర సర్వము నీయానతికొలఁదే తగులుచుండు నివి నిశ్చలముగ నీదాస్యము గలిగినయందాఁకా English(||pallavi||) dehamu sammaṁdhamu yivi dehigim̐ baniledu vūhiṁcha nersinavārale vorusuguṁdurayyā (||deha||) viḍuvavu śhīdoṣhṇaṁbulu viḍuvavu sukhaduḥkhaṁbulu vĕḍavĕḍa maraṇabhayaṁbulu viḍisinayaṁdām̐kā vuḍugavu kāṁkṣhalu mamadalu nudyogaṁbulu siṁtalu pŏḍavagu virakti tanalom̐ bŏḍaminayaṁdām̐kā (||deha||) mānadu sittavigāramu mānadu durgaṇadoṣhamu mānadu bhogamu lanniyu māninayaṁdām̐kā ponīdu sesina duridamu ponīdu vrām̐taphalaṁbunu pūnina tana yajñānamu poyinayaṁdām̐kā (||deha||) tĕgavaḍu bhavabaṁdhaṁbulu tĕga vĕḍayani garvaṁbulu nigiḍina yī yītmajñānamu nīvichchinayaṁdām̐kā jagadegavibhum̐ḍa śhrīveṁkaḍeśhvara sarvamu nīyānadigŏlam̐de tagulusuṁḍu nivi niśhchalamuga nīdāsyamu galiginayaṁdām̐kā