Title (Indic)దరలో నెఱుఁగ మమ్మ తగవు లిటువంటివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దరలో నెఱుఁగ మమ్మ తగవు లిటువంటివి తరుణికే తెలుసును తఱవాతి పనులు (॥ధరలో॥) చెలిమది మదినుండి చెక్కు లేమిటికి గిల్లె కెలసిఁ యాతఁడు గోపగించుకొనఁగా వొలిసి త న్ననరాదు పూరకున్నమగవాని తలఁచి తడవ నెల తా నలుగ నేలా (॥ధరలో॥) అట్టే నవ్వి నవ్వి పతి నాన లేమిటికిఁ బెట్టె దిట్టతనాన నాతఁడు దిట్టఁగాను వొట్టి తన కింతైతే వొద్దనుండ పతితోఁ జేయి ముట్టి సరసము లేల ముంగోప మేలా (॥ధరలో॥) కౌఁగిట శ్రీవేంకటేశుఁ గళ లేల తాఁకించె పీఁగుచు నాతఁడు వొట్టు వెట్టుకోఁగాను రాఁగిన రతులలోన రాజువలె నున్నవాని వీఁగి యెలయించ నేల వేఁడుకొన నేలా English(||pallavi||) daralo nĕṟum̐ga mamma tagavu liḍuvaṁṭivi taruṇige tĕlusunu taṟavādi panulu (||dharalo||) sĕlimadi madinuṁḍi sĕkku lemiḍigi gillĕ kĕlasim̐ yādam̐ḍu gobagiṁchugŏnam̐gā vŏlisi ta nnanarādu pūragunnamagavāni talam̐si taḍava nĕla tā naluga nelā (||dharalo||) aṭṭe navvi navvi padi nāna lemiḍigim̐ bĕṭṭĕ diṭṭadanāna nādam̐ḍu diṭṭam̐gānu vŏṭṭi tana kiṁtaide vŏddanuṁḍa padidom̐ jeyi muṭṭi sarasamu lela muṁgoba melā (||dharalo||) kaum̐giḍa śhrīveṁkaḍeśhum̐ gaḽa lela tām̐kiṁchĕ pīm̐gusu nādam̐ḍu vŏṭṭu vĕṭṭugom̐gānu rām̐gina radulalona rājuvalĕ nunnavāni vīm̐gi yĕlayiṁcha nela vem̐ḍugŏna nelā