Title (Indic)దంటమాటలనె నన్నుఁ దాకనాడేవు వోరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దంటమాటలనె నన్నుఁ దాకనాడేవు వోరి జుంటితేనె తీపులెల్లఁ జూరలాడేవా (॥దంట॥) అత్తయింటికోడల నన్నమ్మమీఁద నేరా నీ- తొత్తుఁ దిట్టినట్టె తిట్ట దొరకొంటివి మెత్తనైతే దిగఁబడి మేరమీరి యింతలోనే ఒత్తుక వచ్చేవు చక్కనుండ నేరవా (॥దంట॥) పంతపు మగఁడు గల పడఁతి నన్ను నేరా నీవు కొంతైనా వెఱపులేక గోరనంటేవు ఇంతలోనే వేలువెట్టి యిమ్ముగైకొని వలపు దొంతులు వేరిచేవు బడుకనియ్యవా (॥దంట॥) ఊరివారి యింతి నన్ను వుద్దండపుఁ దుటారాలఁ బేరుకుచ్చి సోలయుచుఁ బిసాళించేవు గారవించి తిరువేంకటరాయ నీవు నన్ను యేరా నాగుట్టంతయు బాయిట వేసేవా English(||pallavi||) daṁṭamāḍalanĕ nannum̐ dāganāḍevu vori juṁṭidenĕ tībulĕllam̐ jūralāḍevā (||daṁṭa||) attayiṁṭigoḍala nannammamīm̐da nerā nī- tŏttum̐ diṭṭinaṭṭĕ tiṭṭa dŏragŏṁṭivi mĕttanaide digam̐baḍi meramīri yiṁtalone ŏttuga vachchevu sakkanuṁḍa neravā (||daṁṭa||) paṁtabu magam̐ḍu gala paḍam̐ti nannu nerā nīvu kŏṁtainā vĕṟabulega goranaṁṭevu iṁtalone veluvĕṭṭi yimmugaigŏni valabu dŏṁtulu verisevu baḍuganiyyavā (||daṁṭa||) ūrivāri yiṁti nannu vuddaṁḍabum̐ duḍārālam̐ beruguchchi solayusum̐ bisāḽiṁchevu gāraviṁchi tiruveṁkaḍarāya nīvu nannu yerā nāguṭṭaṁtayu bāyiḍa vesevā