Title (Indic)దక్కె నీకుఁ బంతము తగు నింక సంతము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దక్కె నీకుఁ బంతము తగు నింక సంతము మక్కువఁ గలసి యనుమాన మింకానా (॥దక్కె॥) పచ్చికస్తూరినామము పాదపులత్తుక లాయ కొచ్చి పతిమీఁద నేలె కోప మింకాను నిచ్చ సిరసు విరులు నీకుఁ బాదపజ లాయ దిచ్చరి నీ యలుకింకాఁ దీర దాయనా (॥దక్కె॥) పతివదనము తమ్మపడిగ మాయ నీకు మతిఁ జల మింకా నాకు మానదటవే ఆతని చెక్కు చెమట లర్ఘ్యపాద్యము లాయ తతి నీగుండె గరఁగదా యింకాను (॥దక్కె॥) మంచి మంచి వుంగరాల మాణిక పు మట్టెలాయ మంచ మెక్కి వుండి యడమాట లింకానా వంచనై శ్రీవెంకటేశు వావి వరుసయుఁ గూడె అంచె రతులఁ గూడితి వాస లింకానా English(||pallavi||) dakkĕ nīgum̐ baṁtamu tagu niṁka saṁtamu makkuvam̐ galasi yanumāna miṁkānā (||dakkĕ||) pachchigastūrināmamu pādabulattuga lāya kŏchchi padimīm̐da nelĕ koba miṁkānu nichcha sirasu virulu nīgum̐ bādabaja lāya dichchari nī yalugiṁkām̐ dīra dāyanā (||dakkĕ||) padivadanamu tammabaḍiga māya nīgu madim̐ jala miṁkā nāgu mānadaḍave ādani sĕkku sĕmaḍa larghyabādyamu lāya tadi nīguṁḍĕ garam̐gadā yiṁkānu (||dakkĕ||) maṁchi maṁchi vuṁgarāla māṇiga pu maṭṭĕlāya maṁcha mĕkki vuṁḍi yaḍamāḍa liṁkānā vaṁchanai śhrīvĕṁkaḍeśhu vāvi varusayum̐ gūḍĕ aṁchĕ radulam̐ gūḍidi vāsa liṁkānā