Title (Indic)దక్కె నీకుఁ బంతము తగిలినప్పుడె నేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దక్కె నీకుఁ బంతము తగిలినప్పుడె నేము మొక్కితిమిట్టె నీతో మొక్కలము లొల్లము (॥దక్కె॥) కూరిమినైనాఁ గాని కోపాననైనాఁ గాని వూరకే నీమోము చూడకుండలేమురా చేరి యిట్టె పట్టరాని చిత్తమువారము నేము యేరీతినైనాఁ జేయుమిఁకనేల మాటలు (॥దక్కె॥) తత్తరానకైనాఁ గాని తగవునకైనాఁ గాని వొత్తి నిన్నుఁ బిలువక వుండలేమురా చిత్తిణిగుణాన నీకే చిక్కినవారము నేము వుత్తరువు నీకునిదె వొద్దనే వున్నారము (॥దక్కె॥) నగవునకైనాఁ గాని నాటకానకైనాఁ గాని వొగి నిన్నుఁగూడక వుండలేమురా చిగురుఁబాయమునాఁడే సేసవెట్టితిమి నేము మిగుల శ్రీ వేంకటేశ మెచ్చితి నిన్నిపుడు English(||pallavi||) dakkĕ nīgum̐ baṁtamu tagilinappuḍĕ nemu mŏkkidimiṭṭĕ nīdo mŏkkalamu lŏllamu (||dakkĕ||) kūriminainām̐ gāni kobānanainām̐ gāni vūrage nīmomu sūḍaguṁḍalemurā seri yiṭṭĕ paṭṭarāni sittamuvāramu nemu yerīdinainām̐ jeyumim̐kanela māḍalu (||dakkĕ||) tattarānagainām̐ gāni tagavunagainām̐ gāni vŏtti ninnum̐ biluvaga vuṁḍalemurā sittiṇiguṇāna nīge sikkinavāramu nemu vuttaruvu nīgunidĕ vŏddane vunnāramu (||dakkĕ||) nagavunagainām̐ gāni nāḍagānagainām̐ gāni vŏgi ninnum̐gūḍaga vuṁḍalemurā sigurum̐bāyamunām̐ḍe sesavĕṭṭidimi nemu migula śhrī veṁkaḍeśha mĕchchidi ninnibuḍu