Title (Indic)దైవము దూరఁగనేల తమనేర్పు నేర మింతే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవము దూరఁగనేల తమనేర్పు నేర మింతే యీవలఁ దమకర్మము లెంచరు మనుజులు (॥దైవ॥) మొల్లమి గాలియెకటే ముంచి తూరుపెత్తుచోట పొల్లకట్టు కడఁబడె పోగువడె గట్టివెల్లా వుల్లములో శ్రీహరి ఒకఁడై వుండునతని- నొల్లరైరి యసురలు వొలిసిరి సురలు (॥దైవ॥) మించిన జల్లి యొకటె మీఁదనుండు దొడ్డవెల్ల చంచుల సన్నములెల్లా సందులఁ గారు యెంచఁగ హరి యొకఁడే యెరఁగక కొందరైతే కొంచమై రీతనిఁ గొల్చి కొందరైతె ఘనులు (॥దైవ॥) కోవిలలుఁ గాకులును కోరి యొక్కరీతి నుండు యీవల వసంతవేళ నేరుపడును శ్రీవేంకటేశ్వరునిసేవకులు మనుజుల- భావ మొకరీతి నుండు ఫలములే వేరు English(||pallavi||) daivamu dūram̐ganela tamanerbu nera miṁte yīvalam̐ damagarmamu lĕṁcharu manujulu (||daiva||) mŏllami gāliyĕgaḍe muṁchi tūrubĕttusoḍa pŏllagaṭṭu kaḍam̐baḍĕ poguvaḍĕ gaṭṭivĕllā vullamulo śhrīhari ŏgam̐ḍai vuṁḍunadani- nŏllarairi yasuralu vŏlisiri suralu (||daiva||) miṁchina jalli yŏgaḍĕ mīm̐danuṁḍu dŏḍḍavĕlla saṁchula sannamulĕllā saṁdulam̐ gāru yĕṁcham̐ga hari yŏgam̐ḍe yĕram̐gaga kŏṁdaraide kŏṁchamai rīdanim̐ gŏlsi kŏṁdaraidĕ ghanulu (||daiva||) kovilalum̐ gāgulunu kori yŏkkarīdi nuṁḍu yīvala vasaṁtaveḽa nerubaḍunu śhrīveṁkaḍeśhvarunisevagulu manujula- bhāva mŏgarīdi nuṁḍu phalamule veru