Title (Indic)దైవమా నీవే మమ్ము దయదలఁచుట గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నీవే మమ్ము దయదలఁచుట గాక చేవల నీ సేఁతలెల్ల చెల్లును లోకానను (॥దైవ॥) తీపు నంజేవేళ నట్టె తేటఁ బులుసింపౌను పైపైఁ బుణ్యమయితేఁ బాపమింపౌను వోపి జంతువుల కివి వొకటొకటికి లంకె చేపట్టి పాపము లెట్టు సేయకుండవచ్చును (॥దైవ॥) కడుఁ జలువై తేను గక్కన వేఁడింపౌను చెడని విరతివేళ సిరులింపౌను వొడలు మోచినవారి కొకటికటికి లంకె తొడరు భోగాలు మాని తోయ నెట్టువచ్చును (॥దైవ॥) యివియు నీమాయే యిన్నియు నీయాజ్ఞలే జవళిఁ బ్రాణులకెల్ల సమ్మతైనవి యివల శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి తవిలి నీవే గతి దాఁగ నెట్టువచ్చును English(||pallavi||) daivamā nīve mammu dayadalam̐suḍa gāga sevala nī sem̐talĕlla sĕllunu logānanu (||daiva||) tību naṁjeveḽa naṭṭĕ teḍam̐ bulusiṁpaunu paibaim̐ buṇyamayidem̐ bābamiṁpaunu vobi jaṁtuvula kivi vŏgaḍŏgaḍigi laṁkĕ sebaṭṭi pābamu lĕṭṭu seyaguṁḍavachchunu (||daiva||) kaḍum̐ jaluvai tenu gakkana vem̐ḍiṁpaunu sĕḍani viradiveḽa siruliṁpaunu vŏḍalu mosinavāri kŏgaḍigaḍigi laṁkĕ tŏḍaru bhogālu māni toya nĕṭṭuvachchunu (||daiva||) yiviyu nīmāye yinniyu nīyājñale javaḽim̐ brāṇulagĕlla sammadainavi yivala śhrīveṁkaḍeśha yiḍu nīge śharaṇaṁṭi tavili nīve gadi dām̐ga nĕṭṭuvachchunu